Friday, November 22, 2024

దేశంలో కరోనా ‘కప్పా వేరియంట్’

కరోనా మహమ్మారి రోజురోజుకూ తన రూపాన్ని మార్చుకుంటు కొత్త వేరియంట్లతో విరుచుకుపడుతోంది. దేశంలో ఇప్పటికే డెల్టా ప్లస్ మ్యూటెంట్‌ ఆందోళన కలిగిస్తుండగా..తాజాగా ఈ మహమ్మారి మరో కొత్త అవతారం ఎత్తింది. కరోనా మహమ్మారి ఇప్పుడు ‘కప్పా వేరియంట్’ రూపంలో భయాందోళన కలిస్తోంది. భారత్‌లో రెండు కేసులు కూడా వెలుగులోకి వచ్చాయి. దీనిని ఉత్తర్ ప్రదేశ్ లో గుర్తించారు.

కప్పా వేరియంట్‌ కరోనా వైరస్ సోకడంతో ఇద్దరు పేషెంట్లు ఆసుపత్రిలో చేరినట్లు లక్నోలోని కింగ్ జార్జ్ వైద్య కళాశాల, ఆసుపత్రి డాక్టర్లు తెలిపారు. వైరస్ జీనోమ్ సీక్వెన్స్‌ను పరీక్షించిన తరువాత దీన్ని ధృవీకరించినట్లు చెప్పారు. ఇప్పటిదాకా వెలుగులోకి రాని కొత్త మ్యూటెంట్‌గా వైరస్ ఆవిర్భవించినట్లు గుర్తించామని అన్నారు. సాధారణ కరోనా వైరస్ వ్యాప్తితో పోల్చుకుంటే.. దీని వేగం మరింత అధికంగా ఉంటుందని చెప్పారు. 107 మందికి చెదిన డెల్టా ప్లస్ బాధితుల నమూనాలను పరీక్షించగా ఈ కొత్త వేరియంట్ బయట పడింది. కప్పా వేరియంట్ కేసులు వెలుగులోకి వచ్చిన విషయాన్ని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు తెలియజేసినట్లు డాక్టర్లు పేర్కొన్నారు. ఈ తరహా వేరియంట్ కేసులు మరింత వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం ఇచ్చామని చెప్పారు. కాగా, జీనోమ్ సీక్వెన్సింగ్ అనేది ప్రయోగశాల ప్రక్రియ. ఇది ఉత్పరివర్తనాలను వర్గీకరించడానికి, వ్యాధి వ్యాప్తిని గుర్తించడంలో కీలకమైనది. ప్రస్తుతం, రాష్ట్రంలో రోజువారీ పాజిటివిటీ రేటు 0.04 శాతంగా ఉంది.

ఇది కూడా చదవండి: కేరళలో 12 మందికి జికా వైరస్

Advertisement

తాజా వార్తలు

Advertisement