Tuesday, November 26, 2024

ఒక నౌక‌… ఇద్ద‌రు కెప్టెన్ లు – క‌ర్నాట‌క కాంగ్రెస్ లో సిత్రం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకున్న సమయంలో కాంగ్రెస్‌లో పరిస్థితి ”ఒక నౌక-ఇద్దరు కెప్టెన్లు” అన్నట్టు-గా తయారైంది. పోలింగ్‌ తేదీ సమీపిస్తున్నప్పటికీ ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించడం లేదు. సీఎం రేసులో ప్రధాన పోటీ-దారులుగా మాజీ సీఎం సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షులు డీకే శివకుమా ర్‌ ఉన్నారు. ఇద్దరి మధ్య ఉన్న విబేధాలు, స్పర్థలను పక్కన పెట్టి ఎన్నికల్లో ఐకమత్యంగా కనిపిస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయి లో ఆ ప్రభావం ఎంతమేర ఉంటు-ందన్నది సందేహాస్పదమే. ఈ ఇద్దరు నేతల బలాలు, బలహీనతలను ఓసారి పరిశీలిస్తే…

క్లీన్‌ ఇమేజ్‌తో సిద్ధరామయ్య
కర్ణాటక ముఖ్యమంత్రిగా 2013 నుంచి 2018 వరకు పని చేసిన సిద్ధరామయ్య వయస్సు ప్రస్తుతం 75 ఏళ్లు. గత నాలుగు దశాబ్దాల్లో ఐదేళ్ల పూర్తి పదవీకాలం ముఖ్యమంత్రిగా కొనసాగి రికార్డు నెలకొల్పారు. జనతాదళ్‌ (సెక్యులర్‌) వ్యవస్థా పకుల్లో దేవెగౌడతో పాటు- సరిసమానంగా ఉన్న సిద్ధరామ య్య ఆ తర్వాత దేవెగౌడతో విబేధించారు. పార్టీలో దేవెగౌడ కుటు-ంబ ప్రమేయం, పాత్ర పెరిగిపోవడం ఆయనకు నచ్చ లేదు. 8 పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసిన సుదీర్ఘ రాజకీయా నుభవంతో పాటు- ఐదేళ్లపాటు- ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో ఎలాంటి అవినీతి మరకలు లేవు. పైగా 2010లో బళ్లారి ప్రాంతంలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌ను అరికట్ట లేకపోతున్న భారతీయ జనతా పార్టీ పాలనను వ్యతిరే కిస్తూ బెంగళూరు నుంచి బళ్లారి వరకు పాదయాత్ర కూడా చేశారు. సిద్ధరామయ్యకు క్లీన్‌ ఇమేజ్‌తో పాటు- మాస్‌ నేతగా కూడా పేరుంది. బడుగు, బలహీన, దళిత, బహుజన వర్గాల్లో సిద్ధరామయ్యకు గట్టి పట్టు-ంది. ఇవన్నీ ఆయనకు కలిసొచ్చే అంశాలు.

పార్టీ నేతల మాటేంటి?
ఒకవేళ సర్వే ఫలితాలను నిజం చేస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే.. ఈ ఇద్దరు నేతలు అత్యున్నత పదవి కోసం తలపడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇదే విషయంపై పార్టీ నేతలను ప్రశ్నించినప్పుడు భిన్న స్పందనలు వినిపిస్తున్నాయి. ”ప్రతి వ్యక్తి ముఖ్యమంత్రి పదవిని ఆశించే పార్టీ మాది. ఇందులో ఎలాంటి నష్టం లేదు. డీకే శివకుమార్‌ ఆశావాది. అలాగే సీఎం పదవిని ఆశిస్తున్నా రు. నేను కూడా ఆశావాహుణ్ణ. ఇందులో ఎలాంటి నష్టం లేదు” అంటూ సిద్ధ రామయ్య కన్నడ టీవీలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో తెలిపారు. సీఎం పదవిపై డీకే శివకుమార్‌ చేసిన వ్యాఖ్యలు మరోలా ఉన్నాయి. ‘వొక్కలిగ సామాజికవర్గం నుంచి ఎస్‌ఎం కృష్ణ తర్వాత, రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్లి ఎవరూ పనిచేయ లేదు. వొక్కలిగ నేతను ముఖ్యమంత్రిని చేయడానికి ఇదొక మంచి అవకాశం” అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఇద్దరు నేతల ప్రకటనలను బట్టి చూస్తే, కాంగ్రెస్‌ పార్టీ రెండుగా చీలిపోయిన ఇల్లు అనే అభిప్రాయాన్ని కలుగ జేస్తోంది. అయితే ఎన్నికల వేళ ఇద్దరూ స్నేహ పూర్వ కంగానే వ్యవహరిస్తున్నారు. ఐకమత్యానికి భంగం కలుగకుండానే చూసుకుంటున్నారు. ”అసెంబ్లి ఎన్నికల్లో గెలవాలంటే ఇద్దరు పెద్ద నాయకులు కలిసికట్టుగా, ఒక జట్టులా పని చేయాలని పార్టీలోని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకున్నారు. అదే జరుగుతోంది, అదే జరగా లి” అంటూ కాంగ్రెస్‌ నేత రా హుల్‌ గాంధీ గతేడాది వ్యాఖ్యా నించారు. కర్ణాటక పీసీసీ ప్రధాన కార్యదర్శి మరియు అధికార ప్రతినిధి నిజాం ఫౌజ్దార్‌ మాట్లాడుతూ.. ఇద్దరు ముఖ్యనేతల మధ్య విబేధాలు అన్నవి కేవలం మీడియా సృష్టి మాత్రమేనని, అసలు స్పర్థలు, విబేధాలకు తావులేకుండా ఇద్దరూ కలసి పనిచేస్తు న్నారని అన్నారు.

ఈ ఎన్నికల ఫలితాలతోనే వారిద్దరి ఐక్యత, దేశ రాజకీయాలపై చూపబోయే ప్రభావం తెలుస్తుం దని వ్యాఖ్యానించారు. ఈ ఇద్దరు నేతలతో పాటు ముఖ్యమం త్రి పదవిని ఆశిస్తున్న మరికొందరు నేతలు కూడా పార్టీలో ఉన్నా రు. ”నాతో సహా సీఎం పదవికి చాలా మంది సమర్థులైన పోటీ దారులున్నారు. కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే, సిద్ధరామయ్యలు రాష్ట్రంలో మా పార్టీకి పెద్దన్నలు. అలాగే డీకే శివకుమార్‌, దినేష్‌ గుండూరావు, కృష్ణ బైరేగౌడలు రాష్ట్రంలో తర్వాతి వరుస నాయకులు” అంటూ కర్ణాటక మాజీ #హూంమంత్రి ఎంబీ పాటిల్‌ వ్యాఖ్యానించారు. పార్టీ గెలవకముందే సీఎం కుర్చీపై నేతలు కన్నేసి కూర్చున్నా రు. అయితే ఎన్నికల ఫలితాలు వీరి ఆశలను సజీవంగా ఉంచు తాయా లేక నీళ్లు జల్లుతాయా అన్నది మరికొన్నాళ్లలో తేలిపోనుంది.

ట్ర‌బుల్ షూట‌ర్ గా డికె..
బెంగుళూరు రూరల్‌ జిల్లా యువజన కాంగ్రెస్‌ కార్యదర్శిగా రాష్ట్ర రాజకీ యాల్లో గుర్తింపు తెచ్చుకుంటూ ఎదిగిన డీకే శివకుమార్‌ వయస్సు 61 సంవత్సరాలు. ఆయనకు డైనమిక్‌, సమర్ధవంతమైన నేతగా పార్టీలో పేరుంది. పార్టీ క్లిష్ట సమయంలో ఉన్న అనేక సందర్భాల్లో ట్రబుల్‌ షూటర్‌గా పనిచేసి పార్టీని గ-్టట-క్కించిన ఖ్యాతిని పొందారు. కనక్‌పురా నియోజకవర్గం నుండి శాసనసభ్యుడిగా ఉన్న ఆయన రాష్ట్ర మంత్రివర్గంలో రెండుసార్లు మంత్రిగా కూడా పనిచేశారు. మంత్రిగా పనిచేసిన సమయంలో అవినీతి, అక్రమాలకు పాల్పడి.. తద్వారా వచ్చిన సొమ్మును పార్టీ కోసం క్లిష్ట సమయాల్లో ఖర్చు చేసిన డీకే శివకుమార్‌ ప్రస్తుతం సీబీఐ, ఈడీ కేసులను కూడా ఎదుర్కొంటు-న్నారు. ఇవన్నీ ఆయనకు ప్రతికూలంగా కనిపిస్తున్న అంశాలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement