Monday, November 18, 2024

స‌రికొత్త ఫీచ‌ర్ల‌తో ట్విట్ట‌ర్..

త్వ‌ర‌లో ట్విట్ట‌ర్ లో స‌రికొత్త ఫీచ‌ర్లు రానుంది.. ట్విట్ట‌ర్ లో ఫోన్ కాల్ చేసుకునే స‌దుపాయాన్ని క‌ల్పించ‌నున్న‌ట్లు ట్విట్ట‌ర్ సీఈవో ఎలాన్ మ‌స్క్ వెల్ల‌డించారు. ఈ సదుపాయం ద్వారా ప్రపంచంలోని ఎవరితోనైనా నేరుగా మాట్లాడవచ్చట‌. అంతేకాదు.. వాట్సాప్ తరహాలో ఎన్ క్రిప్టెడ్ మెసేజ్ సదుపాయం కూడా అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. దీంతో ట్విట్టర్ యూజర్లు డైరెక్ట్ మెసేజెస్ పంపించుకోవచ్చని వివరించారు. ట్విట్టర్ ఫోన్ కాల్ సౌకర్యంతో ప్రపంచంలో ఎక్కడ ఉన్నవారితో అయినా నేరుగా మాట్లాడే అవకాశం కలుగుతుందని ఎలాన్ మస్క్ చెప్పారు. వీడియో కాల్స్ కూడా చేసుకోవచ్చని అన్నారు. దీనివల్ల అవతలి వ్యక్తికి మీ ఫోన్ నెంబర్ తెలియకుండా జాగ్రత్త పడే వీలు కలుగుతుందని వివరించారు. సరికొత్త ఫీచర్లతో ట్విట్టర్ ను అత్యాధునికంగా తీర్చిదిద్దుతున్నట్లు మస్క్ తెలిపారు. అయితే, ఎన్ క్రిప్టెడ్ మెసేజ్ ల తరహాలో ఫోన్ కాల్స్ కూడా ఎన్ క్రిప్టెడ్ అవునా కాదా అనే విషయాన్ని మాత్రం మస్క్ వెల్లడించలేదు. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్, ఇన్ స్టాలలో ఫోన్ కాల్ సదుపాయం ఇప్పటికే అందుబాటులో ఉన్న సంగ‌తి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement