అమెరికాలోని ట్విట్టర్ కార్యాలయం తాత్కాలికంగా మూతపడింది. అపర కుబేరుడు ఎలాన్ మస్క్ అల్టిమేటంతో.. ఉద్యోగులు మూకుమ్మడి రాజీనామాలు చేయడమే ఇందుకు కారణం. రోజుకో వ్యవహారంతో వార్తల్లో నిలుస్తోంది ట్విట్టర్. తాజాగా.. ట్విట్టర్ ఉద్యోగులు మూకుమ్మడి రాజీనామాలు చేసినట్టు తెలుస్తోంది. ఫలితంగా అమెరికాలోని ట్విట్టర్ కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. తక్షణమే మూసివేత మొదలైనట్లు కూడా ఆ సంస్థ చెప్పింది.
మళ్లీ ఆఫీసు కార్యాలయాలను నవంబర్ 21వ తేదీ నుంచి తెరువనున్నట్లు ఉద్యోగులకు సమాచారం చేరవేసినట్లు ఆ సంస్థ తెలిపింది. ఎక్కువ సమయం పనిచేయాలని కొత్త ఓనర్ ఎలన్ మస్క్ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో ఆ కంపెనీలోని చాలా మంది ఉద్యోగులు సంస్థను వీడుతున్నారు. వందల సంఖ్యలో ఉద్యోగులు రిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మస్క్ అల్టిమేటం నేపథ్యంలో ఉద్యోగుల రాజీనామాలు చేస్తుండడంతో ట్విట్టర్ కార్యాలయం తాత్కాలికంగా మూసివేసినట్లు తెలుస్తోంది.