తమిళనాడు సీఎంగా స్టాలిన్ పదవిని చేపట్టి దాదాపు ఆరు నెలలు గడిచిపోయాయి..తనదైనశైలిలో దూసుకుపోతోన్న స్టాలిన్ పై ఆ రాష్ట్రంలో విమర్శలు వెల్లువెత్తడం విశేషం. గత కొన్ని రోజులుగా తమిళనాడు రాష్ట్రంలో వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలు , వరదలు ఎదుర్కోవడంలో స్టాలిన్ ప్రభుత్వం విఫలమైందని ట్విట్టర్ వేదికగా గో బ్యాక్ స్టాలిన్ అనే హ్యాష్ ట్యాగ్ తో విమర్శలు చేస్తున్నారు. సిమెంట్ బస్తాల ధరలను… మూడు వందల అరవై రూపాయల నుంచి 520 పెంచారంటూ… అలాగే పెట్రోల్ ..డీజిల్ ధరలు తగ్గించ లేదని స్టాలిన్ సర్కార్ పై మండిపడుతున్నారు. తమిళనాడు ప్రజలు వరదలతో ఇబ్బందులు పడుతుంటే సీఎం స్టాలిన్ ఇండియా సిమెంట్ శ్రీనివాస నిర్వహించిన సీఎస్కే పార్టీకి హాజరవుతున్నారని… కార్పొరేట్ కు స్టాలిన్ మొగ్గు చూపుతున్నారంటూ ట్విట్టర్ వేదికగా ఫైర్ అవుతున్నారు. ఇప్పటి వరకు వెలెత్తి చూపించుకోని స్టాలిన్ పై ఈ విమర్శలు రావడం విశేషం.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..