Wednesday, November 20, 2024

Twitter Trolls | రెండువేల నోట్ల రద్దు.. ట్విట్టర్​లో వెల్లువలా మీమ్స్​!

భారత ప్రభుత్వం ఆగమేఘాల మీద అప్పట్లో వెయ్యి, ఐదొందల నోట్లను రద్దు చేసి ప్రజలను ఆగం చేసింది. కోట్లాది మంది పేదల తాము దాచుకున్న డబ్బులను బ్యాంకుల్లో మార్చుకోలేక నానా అగచాట్లు పడ్డారు. ఆ దెబ్బ నుంచి ఇంకా చాలామంది కోలేకోనే లేదు. ఇప్పుడు మోదీ సర్కారు మరో చావు కబురు చల్లగా చెప్పింది. ఇప్పటికిప్పుడు ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా 2వేల రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్టు ఇవ్వాల (శుక్రవారం) భారత ప్రభుత్వం రిజ్వర్వ్​ బ్యాంక్​ ద్వారా తెలియజేసింది.  

అయితే.. మే 23 నుంచి అమలులోకి వచ్చేలా ఇవ్వాల ఆ ప్రకటన చేశారు. రూ.2,000 కరెన్సీ నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తొలగిస్తున్నట్టు గెజిట్​ కూడా వెలువరించింది. ఈ నోట్లను మొదట నవంబర్ 2016లో విడుదల చేశారు. 2018–19లో నోట్ల ఉత్పత్తి నిలిపేశారు. కాగా, మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో రెండు వేల రూపాయల నోట్ల నిషేధంపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. తమదైన శైలిలో సెటైర్లు, మీమ్స్​తో చెలరేగిపోతున్నారు. ఈ ఎఫెక్ట్​ కేంద్ర ప్రభుత్వంపై తప్పకుండా ఉంటుందని, మోదీ మళ్లీ అధికారంలోకి రావడం అసాధ్యం అని నెటిజన్లు సీరియస్​ కామెంట్స్​ చేస్తున్నారు.

అవేంటో మీరూ ఓ లుక్కేయండి..


https://twitter.com/Sassy_Soul_/status/1659562923457642497

Advertisement

తాజా వార్తలు

Advertisement