హీరోలే కాదు వారి సతీమణులు కూడా ఈ మధ్యకాలంలో పాపులర్ అవుతున్నారు. సోషల్ మీడియాలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే నమ్రత, ఉపాసన, స్నేహ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కి టచ్ లో ఉన్నారు. కాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీప్రణతి కూడా సోషల్ మీడియాలోకి అడుగుపెట్టారు. లక్ష్మీప్రణతి పేరిట ఓ ట్విట్టర్ ఖాతా ఓపెన్ అయింది. ‘లక్ష్మీఎన్టీఆర్’ అనే యూజర్ ఐడీతో నాలుగు రోజుల కిందటే అకౌంట్ ఓపెన్ అయింది. ఆ ఖాతాలో ఎన్టీఆర్ తో లక్ష్మీప్రణతి కలిసి ఉన్న ఫొటోను పోస్టు చేశారు. ‘‘ట్విట్టర్ లో మీ అందరితో కలుస్తున్నందుకు ఆనందంగా ఉంది. నా ప్రియమైన భర్త ఎన్టీఆర్ తో కలిసి దిగిన ఫొటోను ఫస్ట్ పోస్టుగా పెడుతున్నాను’’ అంటూ ట్వీట్ చేశారు. తాజాగా నిన్న త్రోబ్యాక్ పిక్ అంటూ రాజమౌళి ఫ్యామిలీతో ఉన్న ఫొటోను ఆయన ఖాతాలో పోస్టు చేశారు. అయితే, ఆమె సోషల్ మీడియాలోకి వచ్చారంటూ కొందరు అభిమానులు ఖుషీ అవుతుంటే.. మరికొందరు మాత్రం అది ఫేక్ అకౌంట్ అని వాదిస్తున్నారు. మరి, ఆ అకౌంట్ నిజమైనదో..కాదో తెలియాలంటే కొన్నాళ్లు వేచి చూడాల్సిందే.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..