గ్లోబల్ మార్కెట్లో ఓపెన్ సెల్ ప్యానళ్ల ధరలు 35 శాతం వరకు పెరుగుతుండడంతో భారల్ లో టీవీల ధరలు పెరగనున్నాయి. ఈ మేరకు ఆయా కంపెనీలు ధరలను పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఇప్పటికే ఎల్‌జీ కంపెనీ ధరలను పెంచగా, ప్యానసోనిక్, హాయెర్, థామ్సన్ తో పాటు పలు బ్రాండ్లు వచ్చే నెల నుంచి ధరలు పెంచడానికి సిద్ధమైనట్లు సమాచారం.
అంతర్జాతీయంగా ప్యానెల్ ధరలు క్రమం తప్పకుండా పెరుగుతున్నాయని, ఈ నేపథ్యంలోనే తామూ టీవీ ధరలు పెంచక తప్పట్లేదని ప్యానసోనిక్ ఇండియా, సౌత్ ఆసియా సీఈవో మనీశ్ శర్మ మీడియాకు చెప్పారు. ఈ ధరలు 5 నుంచి 7 శాతం పెరిగే అవకాశం ఉందని వివరించారు.
35 శాతం వరకు పెరగనున్న టీవీల ధరలు
Advertisement
తాజా వార్తలు
Advertisement