Tuesday, November 26, 2024

తెలంగాణకు మరో మణిహారం – సిద్దమవుతున్నభూగర్భ అక్వేరియం..

హైదరాబాద్ – భాగ్యనగరం అంటే ఠక్కున గుర్తు వచ్చేది ఛార్మీనార్,గోల్కొండ, బిర్లా మందిర్, ట్యాంక్ బండ్, హైదరాబాద్ బిరియాని… తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టూరిజం అభివృద్దిపై ప్ర‌త్య‌క దృష్టి సారించింది.. యాదాద్రిని కోట్లాది రూపాయిల‌తో స‌ర్వ శోభాయాన‌మానంగా తిరిగి నిర్మించి తెలంగాణ ప్ర‌జ‌ల‌కు అంకిత‌మిచ్చింది.. ఇక దుర్గం చెరువుపై కేబుల్ బ్రిడ్జి నిర్మించి ప‌ర్యాట‌కును విస్మ‌య ప‌రిచింది..ఇక దేశంలోనే ఎత్తైన 125 అడుగుల డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద‌ర్క‌ర్ కాంస్య విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించి మరో ప‌ర్య‌ట‌క ప్ర‌దేశంగా ఆ ప్రాంతానికి గుర్తింపు తెచ్చింది.. ఇప్ప‌డు తాజాగా భూగ‌ర్భ అక్వేరియ్ ఏర్పాటుకు ప‌నులు ప్రారంభించింది.. భార‌త దేశంలో ఇంత వ‌ర‌కు భూగ‌ర్భ అక్వేరియం నెల‌కొల్ప‌లేదు.. దీనిని దృష్టిలో ఉంచుకున్న‌తెలంగాణ ప్ర‌భుత్వం ఈ బృహ‌త్త‌ర ప‌థ‌కానికి రూప‌మించింది.. ఇదే విష‌యాన్ని మంత్రి కెటిఆర్ వెల్ల‌డించారు. ట్విట్ట‌ర్ ద్వారా నూకల ప్రేమ్ అనే నెటిజ‌న్ కెటిఆర్ కి ఒక ప్ర‌శ్న సంధించారు.. అదేంటంటే మంత్రి కేటీఆర్‌ గారూ మన హైదరాబాద్‌లో టన్నెల్ అక్వేరియం ఎందుకు లేదు? ఏదైనా హైడ్ అద్భుతమైన సరస్సుల క్రింద ఇది సాధ్యం కాదా? అని మంత్రిని ప్రశ్నించాడు. దయచేసి తెలంగాణకు అద్భుతమైన టన్నెల్ అక్వేరియం బహుమతిగా ఇవ్వండి సార్. దయచేసి ఒక్కసారి ఆలోచించండి అంటూ మంత్రి కేటీఆర్ ను కోరాడు నెటిజన్‌.


అతను చేసిన కొన్ని నిమిషాల్లో మంత్రి స్పందించారు. ఎందుకు సాధ్యం కాదు. చేయొచ్చు మన తెలంగాణలో ఇలాంటి ఇప్పుడు మనం కూడా పెడుతున్నాము ఎక్కడో కాదు తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా కొత్వాల్‌గూడ లో భారతదేశంలోనే అతిపెద్ద అక్వేరియం, ఏవియరీని నిర్మిస్తున్నామంటూ కేటీఆర్‌ బదులు ఇచ్చారు. దానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి మన మందరం కూడా ఆహ్లాదకరమైన అద్భుతమైన టన్నెల్ అక్వేరియంను అతి త్వరలో చూడబోతున్నాము. వైట్‌ అండ్‌ సీ అంటూ నెటిజన్‌ కు రీట్వీట్‌ చేశారు మంత్రి కేటీఆర్‌. అయితే మన తెలంగాణ రాష్ట్రంలో అతి త్వరలో అద్భుతమైన టన్నెల్ అక్వేరియంను చూడబోతున్నామన్నమాట అంటూ నెటిజన్లు థ్యాంక్యూ కేటీఆర్‌ సార్‌. తెలంగాణ‌ ప్రజలు అనుకోవడమే ఆలస్యం అంతకుముందే రాష్ట్ర ప్రజలకు గురించి ఆలోచించి ప్రతీదీ ముందే చేసి మా ఆనందాన్ని రెట్టింపు చేస్తున్నారు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement