Friday, November 22, 2024

ట‌క్క‌ర్ మూవీ.. సిద్ధార్థ్ కి విజ‌యాన్ని అందించిందా..!

ట‌క్క‌ర్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు హీరో సిద్ధార్థ్. టక్కర్ తనకు తెలుగులో మంచి రీ ఎంట్రీ మూవీ అవుతుందని హీరో సిద్ధార్థ్ కాన్ఫిడెన్స్ వ్య‌క్తం చేశారు. మ‌రి ఈ చిత్రం ఎలా ఉందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం..

క‌థ ఏంటంటే.. గుణ శేఖ‌ర్ (సిద్ధార్థ్‌) పేదరికం భ‌రించ‌లేక బాగా డ‌బ్బులు సంపాదించాల‌ని సిటీకి వ‌స్తాడు. అక్క‌డ ఓ బెంజ్ కారున్న ఓన‌ర్ ద‌గ్గ‌ర డ్రైవ‌ర్‌గా జాయిన్ అవుతాడు. సిటీలో డ‌బ్బులున్న అమ్మాయిల‌ను కిడ్నాప్ చేసి.. డ‌బ్బులు గుంజే గ్యాంగ్ స‌భ్యులు ఓసారి గుణ శేఖ‌ర్ కారు ఎక్కుతారు. వారిని పోలీసుల‌ను నుంచి త‌ప్పించ‌టానికి గుణ శేఖ‌ర్ స‌గం డ‌బ్బులు ఇవ్వాల‌ని డీల్ మాట్లాడుకుంటాడు. కానీ వాళ్లు ఇవ్వ‌కుండా పారిపోతాడు. ఓ సంద‌ర్భంలో గుణ శేఖ‌ర్ అనుకోకుండా డ‌బ్బున్న తాన్యా (దివ్యాంశ కౌశిక్‌)ను చూసి మ‌న‌సు ప‌డ‌తాడు. డ‌బ్బులున్న తండ్రి కోసం న‌చ్చిని పెళ్లి చేసుకోవ‌టం తాన్యాకు ఇష్టం ఉండ‌దు. ఆమె స్వేచ్చ‌గా ఉండాల‌ని అనుకుంటూ ఉంటుంది. అనుకోకుండా జ‌రిగే ప్ర‌మాదంలో గుణ శేఖ‌ర్ న‌డుపుతున్న బెంజ్ కారు ప్ర‌మాదానికి గురై పాడ‌వుతుంది. ఆ కారు ఓన‌ర్ త‌న‌ను జీతం లేకుండా ప‌ని చేయాల‌ని కండీష‌న్ పెట్టి చిత‌క్కొడ‌తాడు. జరిగిన అవ‌మానాలు త‌లుచుకుని గుణ చ‌నిపోవాల‌ని అనుకుంటాడు. అయితే అనుకోకుండా కిడ్నాప్ గ్యాంగ్‌తో గుణ ఫైట్ చేయాల్సి వ‌స్తుంది. అక్క‌డ నుంచి త‌ను వెళ్లిపోతూ వారి కారుని తీసుకుని వ‌చ్చేస్తాడు. ఆ కారు డిక్కీలో తాన్యా ఉండ‌టం చూసి షాక‌వుతాడు. తాన్యాను కిడ్నాప్ గ్యాంగ్ ఎత్తుకొచ్చి డ‌బ్బులు డిమాండ్ చేయాల‌నుకుంటే వారి ప్లాన్‌ని గుణ పాడు చేస్తాడు. చివ‌ర‌కు ఆ కిడ్నాప్ గ్యాంగ్ ఏం చేస్తుంది? గుణ‌, తాన్యాల ప్ర‌యాణం ఎక్క‌డి వ‌ర‌కు వెళుతుంది అనేదే ఈ చిత్ర క‌థ‌..

- Advertisement -

విశ్లేష‌ణ‌.. ట‌క్క‌ర్‌ను త‌మిళంతో పాటు తెలుగులోనూ తీసుకొచ్చారు. అయితే ఇంత‌కు ముందు సిద్ధార్థ్ అంటే సాఫ్ట్ క్యారెక్ట‌ర్స్ చేస్తూ వ‌చ్చార‌నే ఇమేజ్ ఉంది. కానీ.. దానికి భిన్నంగా మాస్ అండ్ యాక్ష‌న్ రోల్ చేశారు ట‌క్క‌ర్ సినిమాలో. దివ్యాంశ కౌశిక్ త‌ను చేసిన రెండు, మూడు సినిమాల‌ను దాటి గ్లామ‌ర్ డోస్ పెంచి న‌టించింది. సిద్ధార్థ్ టక్క‌ర్ సినిమాలో మునుప‌టిలాగానే క‌నిపించాడు. అయితే త‌న లుక్ మాత్రం సెట్ అయిన‌ట్లు లేదు.

న‌టీన‌టుల న‌ట‌న‌.. ఈ సినిమాలో సిద్ధార్థ్ రోల్‌ను డైరెక్ట‌ర్ కార్తీక్ జి.క్రిష్ డిజైన్ చేసిన తీరు చూస్తే ఇంత‌కు ముందు ఆవారా వంటి సినిమాల‌ను మిక్స్ చేసి తెర‌కెక్కించిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతుంది. ఇక సినిమా స్టార్ట్ అయిన కాసేప‌టికీ క‌థ‌గ‌మ‌నం ఏంట‌నేది క్లియ‌ర్ క‌ట్ ఐడియా వ‌చ్చేస్తుంది ప్రేక్ష‌కుడికి. ఇక సిద్ధు, దివ్యాంశ కౌశిక్ మ‌ధ్య వ‌చ్చే రొమాంటిక్ స‌న్నివేశాలు చుట్టూ అల్లిన హోటల్ సన్నివేశాలు కాస్త ఎబ్బెట్టుగానే అనిపిస్తాయి. అభిమన్యు సింగ్ విల‌నిజం కామెడీ అయిపోయింది. ఇక యోగిబాబు ఉన్నంత‌లో న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశారు. ఆర్‌.జె.విఘ్నేష్ రోల్ హీరో ఫ్రెండ్‌గా రొటీన్‌గానే క‌నిపిస్తుంది. వాంజినాథ‌న్ మురుగేశ‌న్ సినిమాటోగ్ర‌ఫీ బావుంది. అయితే నివాస్ సంగీతం, నేప‌థ్య సంగీతం బాగోలేదు. మ‌రి సినిమా ఏ మేర‌కు ఆడుతుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement