బిర్యాని అంటే ఇష్టపడని వారు ఉంటారా ? అసలు బిర్యాని అనే పెర్షియన్ పదం ‘బిరియన్’ నుండి ఉద్భవించింది. దీని అర్థం “వేయించిన” లేదా “వేపుడు” అని అర్ధం. ఇప్పటికే బిర్యానీలో ఎన్నో రకాలు ఉన్నాయి. భారతదేశంలో లభించే కొన్ని సాధారణ రకాల బిర్యానీలలో లక్నవి బిర్యానీ, హైదరాబాదీ బిర్యానీ, కాశ్మీరీ బిర్యానీ, అవధి బిర్యానీ, మురదాబాది బిర్యానీ, అస్సామీ కంపూరి బిర్యానీ, కలకత్తా బిర్యానీ వంటివి ప్రాచుర్యంలో ఉన్నాయి. బిర్యానీ తయారీలో ఉపయోగించే మాంసం, బియ్యం, వంట పద్ధతి ద్వారా అనేక విధానాలు ఉన్నాయి. కాగా బిర్యానీ కేలరీల సంఖ్య మాంసం రకంపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. బిర్యానీ మసాలాతో కూడిన రుచికరమైన భారతీయ వంటకం. ఇప్పుడు ట్యూబ్ బిర్యానీ కూడా వచ్చింది. ఆ వివరాలు మీ కోసం..
బిర్యానీలో పుష్కలమైన క్యాలరీలు ఉంటాయి. 200 గ్రాముల బిర్యానీలో సగటున 290 కేలరీలు ఉంటాయి. మంచి ఆహారం మానసిక స్థితిని పెంచుతుందన్న విషయం తెలిసిందే. అయితే, బిర్యానీ దానిని రుజువు చేస్తుంది. బిర్యానీ తిన్న తర్వాత మనిషికి ఎంతో ఉత్సాహం వస్తుంది. సుగంధ ద్రవ్యాలు యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఇవి రోగ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి. బిర్యానీ తయారీలో వెల్లుల్లి, జీలకర్ర, అల్లం, కుంకుమ, పసుపు, నల్ల మిరియాలు వంటి సుగంధ ద్రవ్యాలను విరివిగా వాడతారు. వాటి వల్లే మనలో మంచి ఉతేజం వస్తుందట. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 35,056 రకాల బిర్యానీలను సరఫరా చేస్తోంది స్విగ్గీ.. బోన్‌లెస్ చికెన్ బిర్యానీ, చికన్ దమ్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, వెజ్ బిర్యానీ, పన్నీర్ బిర్యానీలకే అత్యధికంగా డిమాండ్ ఉందని తేల్చింది. ముంబైలో ‘చాల్ థానో తావా బిర్యానీ’ఇలా పలు రకాలు ఉన్నాయి.
ఇక బిర్యానీలో హైదరాబాద్ బిర్యానీ,సింధీ బిర్యానీ,లఖ్‌నవీ బిర్యానీ,అంబూర్ బిర్యానీ,టెహ్రీ బిర్యానీ,తలసేరి బిర్యానీ,కోల్‌కతా బిర్యానీ,మెమోని బిర్యానీ,బొంబాయి బిర్యానీ,బేరీ బిర్యానీ ఇవేకాదండోయ్ బొంగు చికెన్ బిర్యాని..కుండ బిర్యానీ..ఆకు బిర్యానీ ఇలా పలు రకాలు ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్ గా ట్యూట్ బిర్యానీ కూడా వచ్చేసింది. మరి ఈ ట్యూబ్ బిర్యానీ ఎక్కడ పుట్టింది..దాని ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం. ట్యూబ్ ను పోలి ఉన్న దాంట్లో ఈ బిరియాని ఉంటుంది. ప్రయాణాల్లో సైతం ఈజీగా తీసుకువెళ్లొచ్చు. ఈ ట్యూబ్ బిరియానీలో నాలుగు కప్పులు ఉంటాయి. మరి వాటిల్లో ఏం ఏం ఉంటాయో చూద్దాం. బిర్యానీతో పాటు..వంకాయి కూర..రైతా,,బ్రెడ్ హల్వా..ఉంటాయి. అరటి ఆకులతో చక్కగా..శుభ్రంగా వీటిని ప్యాక్ చేస్తారు. ఇప్పుడీ బిర్యానీ బాగా ఫేమస్ అవుతోంది. ఈ బిర్యానీ కర్ణాటక తదితర ప్రాంతంలో తయారు అవుతోంది. ఆన్ లైన్ ఆర్డర్స్ కూడా ప్రారంభమయిపోయాయి.