కెమెరాకు చిక్కిన ఈ ఫొటోను బాగా చూడండి.. వేర్వేరు రైళ్లలో జర్నీ చేస్తున్న ఈ ఇద్దరు ఒకే ఫొటోలో సెల్ఫీ దిగడం అనేది చాలా అరుదైన విషయం.. అయితే అంతే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. వీళ్లిద్దరూ తండ్రీకొడుకులు కావడం ఇక్కడ మరో స్పెషాలిటీ. ఇప్పుడీ ఫొటో సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది. ‘‘అబ్బా కొడుకులు భళే ఫొటో దిగారు కదా”అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. చాలా అరుదైన మూమెంట్, వాటే గ్రేట్ అంటూ ఇంకొంతమంది రీ ట్వీట్ చేస్తున్నారు.
ఇలాంటి మధు క్షణాలు అనేవి చాలా కొద్దిమందికే దక్కుతాయని, ఎంతైనా వారిద్దరు చాలా అదృష్టవంతులంటున్నారు ఇంకొంతమంది నెటిజన్లు. పిల్లలతో పాటు తల్లిదండ్రులు ఇట్లాంటి అద్భుతమైన డ్యూటీ చేస్తూ.. ఒకే ఫ్రేమ్‌లో, వేర్వేరు రైళ్లలో ఉండగా ఫొటో దిగడం అనేది కూడా చాలా డిఫరెంట్‌గా ఉందంటున్నారు.
కాగా, సురేష్ కుమార్ ట్విట్టర్లో షేర్ చేసిన ఈ ఫొటో.. కొడుకు ట్రావెల్ టికెట్ ఎగ్జామినర్ (TTE) కాగా, అతని తండ్రి రైల్వేలో గార్డుగా పనిచేస్తున్నారు. తండ్రీకొడుకులు డ్యూటీ సమయంలో అకస్మాత్తుగా ఇలా వేర్వేరు రైళ్లలో కనిపించారు. ఈ క్రమంలో కొడుకుఈ ఫొటోని తీయగా.. అదిప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
“తండ్రి రైల్వేలో గార్డు, కొడుకు టీటీ. రెండు రైళ్లు పక్కపక్కనే వెళ్లినప్పుడు సెల్ఫీ దిగడం బాగుంది” అని క్యాప్షన్‌ని యాడ్ చేశారు. నెటిజన్లు ఈ ఫోటోను ఇష్టపడి పోస్ట్ ను ప్రేమతో షేర్ చేస్తున్నారు. 60 వేలకు పైగా లైక్స్ తో, ఈ ఫొటో ఇప్పుడు వైరల్‌గా మారింది. తండ్రీకొడుకుల జంట ఎప్పటికీ ఆరాధించే ఫొటో అని చాలా మంది సూచించారు. ఈ పోస్ట్ గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి?