శ్రీవారిని దర్శించుకోవాలని ఎవరు అనుకోరు. ఆ ఏడు కొండలస్వామి ఆశీర్వాదం పొందేందుకు అందరూ తపిస్తుంటారు. కాగా ప్రత్యేక దర్శన టికెట్ లాగే స్వామి వారి ఉదయాస్తమ సేవా టికెట్ల ధరను టిటిడి నిర్ణయించింది. సాధారణ రోజుల్లో ఈ టికెట్ ధర రూ. 1కోటి ఉండగా… శుక్రవారం మాత్రం ఈ టిక్కెట్ ధర రూ. 1.5కోట్లుగా నిర్ణయించారు. కాగా టీటీడీ వద్ద 531 ఉదయాస్తమ టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ టికెట్ తో 25 ఏళ్ల పాటు ఆర్జిత సేవలో పాల్గొనే అవకాశం భక్తులకు లభిస్తుంది.
ఉదయాస్తమ సేవ టికెట్ తీసుకున్న వారికి ఏడాదికి ఒక రోజున ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు ఆరుగురు భక్తులు పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఈ టికెట్ల వల్ల టీటీడీకి దాదాపు రూ. 600 కోట్ల ఆదాయం వస్తుంది. ఈ సేవా టికెట్ల వల్ల వచ్చే ఆదాయాన్ని చిన్న పిల్లల ఆసుపత్రి అభివృద్ధికి కేటాయించాలని టీటీడీ నిర్ణయించింది. మరి ఈ టిక్కెట్లని ఎవరు సొంతం చేసుకోనున్నారో చూడాలి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..