తెలంగాణ ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి పలు మార్పులతో తెలంగాణ ఆర్టీసీ దూసుకుపోతోంది. ప్రయాణికులకు.. ఆర్టీసీ సర్వీసుని ప్రజలకి దగ్గర చేసేందుకు అనేక ప్రణాళికలు రచిస్తోంది తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం. ఇప్పటికే చాలా ఆఫర్ లు ప్రకటిస్తూ ప్రయాణికులను ఆకట్టుకుంటుంది ఆర్టీసీ. ఇక తాజాగా కొత్తగా పెళ్లి చేసుకునే వారికి తెలంగాణ ఆర్టీసీ మరో ఆఫర్ ప్రకటించింది. పెళ్లిళ్లకు .. శుభకార్యాలకు ఒక నెల ముందు తెలంగాణ ఆర్టీసీ బస్సులు బుక్ చేసుకుంటే… 20% డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు ఆర్టిసి ఎండి సజ్జనార్ ప్రకటన చేశారు. సాధారణ చార్జీల కంటే 15 శాతం తగ్గింపు కూడా ఇస్తామని ఆయన వెల్లడించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా వేదిక గా ప్రకటన చేశారు ఆర్టిసి ఎండి సజ్జనర్.ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరారు.
తెలంగాణ ఆర్టీసీ మరో సదవకాశం – పెళ్లిళ్ళకి బస్సు బుక్ చేస్తే – 20% డిస్కౌంట్
Advertisement
తాజా వార్తలు
Advertisement