Monday, November 25, 2024

Sajjanar: అర్ధరాత్రి TSRTCకి ట్వీట్ చేసిన యువతి.. వెంటనే స్పందించిన ఎండీ!

తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రయాణికుల కోసం ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు. ఆర్టీసీ ఆదాయం పెంచడంతోపాటు ప్రయాణికుల సౌకర్యాలపై దృష్టి సారించారు. ఈ క్రమంలో ఇప్పటికే బస్సు సౌకర్యం లేని ఊళ్లకు ఆర్టీసీ సేవలు కల్పించారు. అంతేకాదు ప్రయాణికులను ఆక్షరించేందుకు ఎన్నో రకాల ఆఫర్ లు సైతం ప్రకటించారు. అంతేకాదు సంక్రాంతికి ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులకు కూడా ఎలాంటి అనదపు ఛార్జీలు వసూలు కూడా చేయడం లేదు. ప్రయాణికులు ఏ సమస్యను తన దృష్టికి తీసుకొచ్చిన వెంటనే పరిష్కరిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా అర్ధరాత్రి TSRTCకి ఓ యువతి చేసిన ట్వీట్ పై వెంటనే RTC MD సజ్జనార్ స్పందించారు.

అర్ధరాత్రి సమయాలలో RTC బస్సులలో మహిళల సౌకర్యం కోసం ( వాష్ రూమ్స్ ) బస్సులను పెట్రోల్ పంప్ లలో 10 నిమిషాలు బస్సు ఆపాలని యువతి పాలే నిషా కోరారు. దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే మహిళలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీంతో అర్ధరాత్రి చేసిన ట్వీట్ కి స్పందించిన ఎండి సజ్జనార్.. ఈ విషయంపై అధికారులకు సూచించినట్లు రీట్వీట్ చేశారు. అర్ధరాత్రి సైతం మహిళ సమస్య పై సజ్జనార్ స్పందించడంతో పాలే నిషా ఆనందం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement