Sunday, November 3, 2024

TSRTC | లాంగ్​ జర్నీ చేసేవారికి టీఎస్​ఆర్టీసీ గుడ్​ న్యూస్​.. రిజర్వేషన్లలో డిస్కౌంట్​ ప్రకటించిన సంస్థ

ప్రయాణికులకు టీఎస్​ ఆర్టీసీ గుడ్​న్యూస్​ చెప్పింది. కొత్త బస్సులు, కొత్త రూట్లలో సర్వీసులను నడుపుతున్న సంస్థ ఇప్పుడు మరో అప్​డేట్​ని ఇచ్చింది.  రిజర్వేషన్​ పరంగా ఓ సరికొత్త విషయాన్ని ఆ సంస్థ ఇవ్వాల (సోమవారం) ప్రకటించింది. ఇప్పటివరకు రిజర్వేషన్​ చేసుకున్న వారికి ఎలాంటి తగ్గింపు ఉండకపోయేది. కానీ, ఇక మీదట  ఎక్స్​ప్రెస్​, డీలక్స్​ సర్వీసుల్లో 350 కిలోమీటర్లో లోపు ముందస్తు రిజర్వేషన్​ చేసుకునే వారికి 20 రూపాయల తగ్గింపు ఇవ్వనున్నట్టు ప్రకటించింది.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

సూప‌ర్ ల‌గ్జరీ, ఏసీ స‌ర్వీసుల్లో అయితే ఏకంగా 30రూపాయలుగా ఈ తగ్గింపు ఉండనున్నట్టు  టీఎస్​ ఆర్టీసీ తెలిపింది. సుదూర ప్రాంతాల‌కు వెళ్లే ప్రయాణికుల ఆర్థిక భారం త‌గ్గించేందుకు ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్ చార్జీల‌ను తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) స‌వ‌రించడమే దీనికి కారణంగా తెలుస్తోంది.

ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్ స‌దుపాయ‌మున్న ఎక్స్ ప్రెస్, డీల‌క్స్, సూప‌ర్ ల‌గ్జరీ, ఏసీ స‌ర్వీసుల్లో చార్జీల‌ను త‌గ్గిస్తూ సంస్థ  నిర్ణయం తీసుకుంది. ఎక్స్ ప్రెస్, డీల‌క్స్ స‌ర్వీసుల్లో 350 కిలో మీట‌ర్ల లోపు రూ.20గా, 350 ఆపై కిలోమీట‌ర్లకు రూ.30గా చార్జీని నిర్ణయించింది.  

టీఎస్ఆర్టీసీ బ‌స్సుల్లో ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్‌కు మంచి స్పంద‌న ఉందని, ప్రతి రోజు స‌గ‌టున 15 వేల మంది వ‌ర‌కు రిజ‌ర్వేష‌న్ చేసుకుంటున్నారని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. వారికి ఆర్థిక భారం త‌గ్గించేందుకు ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్ చార్జీల‌ను త‌గ్గించ‌డం జ‌రిగిందని తెలిపారు. ఈ స‌దుపాయాన్ని ప్రయాణికులంద‌రూ ఉప‌యోగించుకుని.. సంస్థను ఆద‌రించాలని టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవ‌ర్దన్, సంస్థ ఎండీ వీసీ స‌జ్జన‌ర్ కోరారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement