Friday, November 22, 2024

TSRTC: మేడారం జాతరకు ఆర్టీసీ బస్సులు.. 30 మంది ఉంటే చాలు..

ఆసియాలోనే అతిపెద్ద మేడారం జాతరకు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు మహా జాతర జరగనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి మేడారం జాతర కోసం ప్రత్యేక బస్సు సేవలను టీఎస్ ఆర్టీసీ అందుబాటులోకి తీసుకురానుంది. MGBS నుంచి ప్రత్యేక బస్సులు నడుపనున్నారు. బస్సులు ఎంజీబీఎస్ నుంచి ఉదయం 6 గంటలకు మొదలవుతాయి. ప్రజల సౌకర్యార్థం ఆర్టీసీ వెబ్ సైట్‌లో, టీఎస్ఆర్టీసీ యాప్‌లో టికెట్లను బుక్‌ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ ప్రత్యేక బస్సులకు రూ.398లు చార్జీలు వసూలు చేయనున్నారు.

మరోవైపు ప్రయాణికులు నేరుగా తమ ఇంటి వద్ద నుంచే బయలుదేరేందుకు వీలుగా ఆర్టీసీని అందుబాటులోకి తీసుకొచ్చారు. మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు వెళ్లే భక్తులు కనీసం 30 మంది ఉంటే చాలు. బస్సు అద్దెకు తీసుకొని వెళ్లవచ్చు. ఆర్టీసీ బస్సులు నేరుగా సమ్మక్క గద్దె వరకు వెళ్తాయి. సమీపంలోని డిపో మేనేజర్‌ను సంప్రదించి బస్సును బుక్‌ చేసుకోవచ్చు. నేటి(ఫిబ్రవరి 1) నుంచి ఈ నెల 11 వరకు 30 మంది ప్రయాణికులు ఉంటే.. వారు కోరిన చోటికి బస్సులను పంపిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement