తెలంగాణలో ఆర్టీసీ టికెట్ ధరలు మళ్లీ పెరగనున్నాయని తెలుస్తోంది. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో ఆర్టీసీకి పెనుభారంగా మారుతోంది. ఇప్పటికే ఆర్టీసీ పీకల్లోతు నష్టాల్లో ఉంది. దీనికి తోడు ఇటీవల డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మరిన్ని అప్పులు పెరగకుండా ఉండేందుకు.. డీజిల్ సెస్ విధించాలని టీఎస్ఆర్టీసీ భావిస్తోంది. నష్టాల ఊబి నుంచి బయటపడేందుకు డీజిల్ సెస్ పేరిట చార్జీలను మరో 10 నుంచి 15 శాతం వరకు సవరించాలని టీఎస్‌ఆర్టీసీ ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. అయితే, దీనిపై నిపుణులతో చర్చించాక నిర్ణయం తీసుకోవాలని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే ప్రయాణికులపై మరింత అదనపు భారం పడే అవకాశముంది. గత రెండేళ్లుగా కరోనా వల్ల ఆర్టీసీ ఎంతో నష్టపోయింది. కార్గో సేవలతో ఆదాయం పెరిగినా.. డీజిల్ ధరలు పెరగడంతో నష్టాలు అధికం అవుతున్నాయి. నష్టాలను పూడ్చుకునేందుకు మార్చిలో రౌండప్ చార్జీలు, టోల్ సెస్, ప్యాసింజర్ సెస్ పేరిట 10 శాతానికిపైగా చార్జీలను పెంచారు. ప్రస్తుతం డీజిల్ ధరలు రోజు రోజుకి అధికం అవుతున్నాయి. దీంతో టికెట్ ధరలు పెంచే అవకాశం ఉంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement