తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచి మేడారం జాతరకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు మేడారం జాతర అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. అసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ జాతరకు తెలుగురాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకునేందుకు వస్తుంటారు. ఈ జాతరకు దాదాపు 21 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో టీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. మేడారం జాతర కోసం ప్రత్యేకంగా 3,845 బస్సులను నడపాలని నిర్ణయించారు. ఒక్క వరంగల్ రీజియన్ నుంచే 2,250 బస్సులు నడిపాలని అధికారులు భావిస్తున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఏసీ బస్సులను నడపనున్నారు. అంతేకాదు మేడారంలో బస్సుల కోసం 50 ఎకరాల్లో భారీ బస్టాండును నిర్మిస్తున్నారు. టికెట్లు క్యూ కోసం స్థలాన్ని చదును చేసే పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
మరోవైపు మేడారం జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. కరోనా, ఒమిక్రాన్ నేపథ్యంలో శానిటేషన్ వంటి ఏర్పాట్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital