హైదరాబాద్ – టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజ్ లో ప్రధాన సూత్రధారులు ప్రవీణ్,రాజశేఖర్ లేనని పోలీసులు గుర్తించారు.. ఈ ఇద్దరే కుట్ర పూరితంగా పేపర్లు దొంగిలించి టీచర్ రేణుకకు అమ్మడం కోసం ఇచ్చారని ప్రాధామిక దర్యాప్తులో తేలింది.. ఈ కేసులో విచారణ కోసం మొత్తం తొమ్మిదిమందిని తమ అదుపులోకి తీసుకున్నసిట్ టీఎస్ పీఎస్సీ కార్యాలయానికి నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ లను తీసుకెళ్లారు.. అక్కడ ఏ విధంగా పేపర్లో దొంగిలించారో వారి నుంచే వివరాలు సేకరించారు..టీఎస్ పీఎస్సీలో ఇద్దరు నిందితులను కాన్ఫిడేషన్ సెక్షన్ లో తీసుకెళ్ళి విచారణ చేసిన సిట్ టీం కాన్ఫిడేషన్ సెక్షన్ లో సిస్టం లోని ఐపిలను ఎలా మార్చారు. డైనమిక్ పాస్ వర్డ్ లను ఎలా ట్రేస్ చేశారని టెక్నికల్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.
మార్చి 5 లీకైన పేపరు కాకుండా ఇంకా ఎన్ని పేపర్స్ లీక్ చేశారు . గతేడాది జరిగిన గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ పేపర్ కూడా లీక్ చేశారా వంటి వివరాలపై సిట్ ఆరాతీసింది. కాన్ఫిడేషన్ సెక్షన్ లో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ వద్ద పని చేస్తున్న శంకర్ లక్మి ని కూడా సిట్ ప్రశ్నించింది. అయితే తాను డైరీలో ఎక్కడా కూడా పాస్ వర్డ్ ను రాయలేదని చెప్పింది. రాజశేఖర్ రెడ్డి ఐపీ అడ్రస్ లను మార్చి కంప్యూటర్ లో పాస్ వర్డ్ దొంగిలించినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఫిబ్రవరి 27 కంటే ముందు నుంచే లీకేజీ వ్యవహారం నడిపించినట్లు పోలీసులు తేల్చారు. కాగా, లోతైన విచారణ కోసం కార్యాలయంలోని రెండు సిస్టంలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులిద్దర్ని టీఎస్ పీఎస్సీ కార్యాలయం నుంచి సిట్ కార్యాలయానికి తరలించారు.