Friday, November 22, 2024

Breaking: TSPSC ఆందోళన – షర్మిల, ప్రవీణ్ అరెస్ట్

టీఎస్ పీఎస్సీలో పరీక్షా పత్రాలు లీకేజీ అయిన వ్యవహారంలో ఆ పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, బీఎస్పీ అధినేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేడు ఆందోళన బాటపట్టారు. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల ను ఆమె ఇంటి వద్దనే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక టీఎస్ పీఎస్సీ కార్యాలయం చేరుకున్న ప్రవీణ్ ను అక్కడే నిలువరించి పోలీసు స్టేషన్ కు తరలించారు. కాగా ఈ ఇద్దరు నేతలు టీఎస్ పీఎస్సీలో జరిగిన స్కాములపై సమగ్ర విచారణ జరిపించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను కూడా వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement