Friday, November 22, 2024

ఇంజినీరింగ్ ఫీజులు ఖరారుచేసిన టీఎస్ సర్కార్..

రాష్ట్రంలో ఇంజినీరింగ్ ఫీజులను తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. ఏఎఫ్ఆర్సీ సిఫార్సుల మేరకు 159 కాలేజీల్లో ఫీజులను నిర్ధారించింది. ఈ మేరకు 159 కాలేజీల్లో ఫీజులు ఖరారు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 40 కాలేజీల్లో ఇంజినీరింగ్ రూ.లక్ష దాటింది.ఇంజినీరింగ్ కాలేజీల్లో కనీస రుసుం రూ.45 వేలకు పెరిగింది.అదేవిధంగా ఎంజీఐటీ కాలేజీలో రూ.1.60 లక్షలు, సీవీఆర్ లో రూ.1.50 లక్షకు చేరింది.సీబీఐటీ, వర్ధమాన్, వాసవి కాలేజీల్లో రూ.1.40 లక్షలుగా ఉంది. కాగా కొత్త ఇంజినీరింగ్ ఫీజులు మూడేళ్ల పాటు అమల్లో ఉంటాయని ప్రభుత్వం తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement