మహబూబ్ నగర్ (ప్రభ న్యూస్) : త్వరగా గమ్యానికి చేరుకోవడానికి, ట్రాఫిక్ నియంత్రించేందుకు బైపాస్ రోడ్డు లు ఏర్పాటు చేస్తారు.. కానీ, మహబూబ్ నగర్ లోని ఎస్వీఎస్ హాస్పిటల్ నుండి పాలకొండ వరకు ఏర్పాటు చేసిన బైపాస్ రోడ్ ప్రమాదాలకు కేరాఫ్ గా మారింది. ఎదిర, దివిటిపల్లి , హోసింగ్ బోర్డు , సిద్దయ్యపల్లి , అప్పన్నపల్లి, ఏనుగొండ ప్రాంతాల ప్రజలను కాటికి దగ్గర చేసేందుకే ఏర్పడినట్లుందని ఇక్కడి ప్రజలు తమ భాదను వ్యక్తం చేస్తున్నారు.
సంబంధిత అధికారులు హైమాస్ లైట్లు , బారికేడ్లు , సిగ్నల్స్ ఏర్పాటు చేయకపోవడంతో ఈ రోడ్డులో యాక్సిడెంట్లు ఎక్కువవుతున్నాయి. బైపాస్ రోడ్డులో పరిమితి మించి వాహనాలను నడపకుండా తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం కూడా ప్రాణాలమీదికి తెస్తోంది. ఇప్పటికే ఇక్కడ ఎన్నో ప్రమాదాలు జరిగాయని వారం రోజుల్లో 3 పెద్ద ప్రమాదాలు సంభవించి ఒకరు చనిపోగా మిగితా రెండు ప్రమాదాలలో గాయపడిన వారు చావుతో పోరాడుతున్నారన్నారు.
ఇక్కడి ప్రజలు ఇప్పటికే బైపాస్ రోడ్డు నుండి వేళ్తే ఎవరి మరణ వార్త వినాలో లేదా వారే వార్తగా మారతారో అని బయపడతూ బైపాస్ రోడ్ నుండి కాకుండా హోసింగ్ బోర్డు , SVS మీదుగా వెళ్తున్నారు. ఈ పరిస్థితి ఇలానే ఉంటె కొద్దీ రోజుల్లో ప్రజలు అక్కడినుండి వెళ్లకుండా ఆ రోడ్డుకి ఎవ్వరు ఊహించని పేరు పెట్టె అవకాశాలు లేకపోలేదని ఇక్కడి ప్రజలు అనుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: మూడు కోట్లకు టోకరా వేసిన వ్యాపారి
రెండు మాసాలా క్రితం ఆంధ్ర ప్రభ లో ప్రచురితమైన “బయాందోళలు కలిగిస్తున్న బైపాస్ రోడ్” అనే కథనానికి ట్రాఫిక్, రూరల్ పోలీసులు స్పందించి తాత్కాలికంగా సమస్య పరిష్కరించే దిశగా బారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అయినప్పటికీ ప్రమాదాలు ఆగడం లేదు. దీపావళి రోజున ద్విచక్ర వాహనం పై వస్తున్న ఒక వ్యక్తి బైపాస్ రోడ్ లో లైటింగ్ లేక చిమ్మ చీకటిగా ఉండడంతో బారికేడ్లు కనపడక ప్రమాదం జరిగి మృతి చెందాడు.
R&B డిపార్ట్మెంట్ వారు కానీ , మున్సిపాలిటీ అధికారులు కానీ , పోలీస్ శాఖ వారు కానీ ఇక్కడ జరుగుతున్న మరణాలను వార్తలుగా కాకుండా దయచేసి ఇంకో మరణం సంబవించేలోపు మానవతా దృక్పథంతో భాద్యతగా తీసుకొని మరణాలను నియంత్రించే దిశగా సంబంధిత అధికారులతో చర్చించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Breaking: అల్పపీడనం ఎఫెక్ట్.. వరద గుప్పిట్లో చెన్నై.. వెంటాడుతున్న 2015 భయం