Monday, November 18, 2024

టీఎస్​ ఎంసెట్​ పరీక్షలు ప్రారంభం.. కరెంట్​ లేక వరంగల్​లో గంట ఆలస్యంగా ఎగ్జామ్​ షురూ!

టీఎస్​ ఎంసెట్​ పరీక్షలు ఇవ్వాల ప్రారంభమయ్యాయి. వరంగల్​ జిల్లాలోని గణపతి ఇంజినీరింగ్​ కాలేజీలో కరెంటు లేకపోవడంతో గంట ఆలస్యంగా ఎగ్జామ్​ ప్రారంభమైనట్టు తెలుస్తోంది. అయితే.. ఇక్కడ ఉన్న జనరేటర్​ కూడా పనిచేయడం లేదని అందుకే ఆలస్యంగా ప్రారంభించినట్టు అధికారులు అంటున్నారు. షెడ్యూల్​ ప్రకారం.. ఉదయం 9 గంటల నుంచి 12 వరకు కంప్లీట్​ కావాల్సి ఉండగా.. మధ్యాహ్నం 1.30 అయినా పరీక్ష పూర్తి కాలేదు. కరెంటు లేక, కంప్యూటర్స్​ పనిచేయక విద్యార్థులు ఇక్కట్లు పడ్డారు. దీనిపై విద్యార్థుల పేరెంట్స్​ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైతే పరీక్ష కేంద్రంలోని అనుమతించబోమని కండిషన్స్​ పెట్టిన అధికారులు.. దీనికి ఏం సమాధానం చెబుతారని నిలదీస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement