Tuesday, November 26, 2024

టీఎస్‌ ఐసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. అక్టోబర్‌ 18న ఎంబీఏ, ఎంసీఏ మొదటి విడత సీట్లు కేటాయింపు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: టీఎస్‌ ఐసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ సోమవారం విడుదలైంది. అక్టోబర్‌ 8వ తేదీ నుంచి ఐసెట్‌ తొలివిడత కౌన్సెలింగ్‌ ప్రారంభం కానున్నట్లు సాంకేతిక విద్యాశాఖ ప్రకటించింది. అక్టోబర్‌ 8 నుంచి 12 వరకు స్లాట్‌ బుకింగ్‌ ఉంటుందని, ధృవపత్రాల పరిశీలనకు 10 నుంచి 13 వరకు అవకాశం కల్పించారు. అక్టోబర్‌ 10 నుంచి 15వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లు నమోదుకు అవకాశం కల్పించగా 18న ఎంబీఏ, ఎంసీఏ మొదటి విడత సీట్లను కేటాయించనున్నారు.

18 నుంచి 21వ తేదీల్లో ట్యూషన్‌ ఫీజును చెల్లించి సీటు పొందిన కాలేజీల్లో ఆన్‌లైన్‌ ద్వారా అభ్యర్థులు సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంటుంది. అక్టోబర్‌ 23 నుంచి తుదివిడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ జరగనుంది. 23 నుంచి 25 వరకు తుదివిడత వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోగా 28న ఎంబీఏ, ఎంసీఏ తుదివిడత సీట్లను కేటాయిస్తారు. అదే రోజు స్పాట్‌ అడ్మిషన్ల కోసం మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి జులై 28న కాకతీయ యూనివర్సిటీ ఐసెట్‌ ఎంట్రెన్స్‌ను నిర్వహించగా ఆగస్టు చివరి వారంలో ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement