తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు యథాతథంగా జరగనున్నాయి. ఈ నెల 25 నుంచి జరగాల్సిన ఫస్ట్ ఇచర్ ఎగ్జామ్స్ రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర తల్లిదండ్రుల సంఘం దాఖలు చేసిన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం అత్యవసర విచారణ చేపట్టింది. లంచ్ మోషన్ పిటిషన్ వెనక్కి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. పిటిషన్ దాఖలు చేయడంలో ఆలస్యం అయ్యిందని కోర్టు వెల్లడించింది. విద్యార్ధుల భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోర్టు వివరించింది. తెలంగాణ వ్యాప్తంగా 4 లక్షల 50 వేల మంది విద్యార్ధులు పరీక్షలు రాయనున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement