జయశంకర్ భూపాలపల్లి: ఇంటర్మీడియట్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. బుధవారం నుండి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని నోడల్ ఆఫీసర్ కే దేవరాజం తెలిపారు. జిల్లాలో 902 మంది జనరల్ సైన్స్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు, 435 మంది ఒకేషనల్ విద్యార్థులు మార్చి 23 నుండి ఏప్రిల్ 8వ తేదీ వరకు జరిగే పరీక్షలకు హాజరవుతారన్నారు. వీరి కోసం జిల్లాలో 12 జనరల్ ప్రాక్టికల్ పరీక్ష కేంద్రాలు 4 ఒకేషనల్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. అన్ని పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకు ఏ రకమైన అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేశామన్నారు. అలాగే మార్చి 23 నుండి 8వ తేదీ వరకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని పరీక్షల సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడం అవసరమైన సహాయం పొందడానికి జిల్లా నోడల్ ఆఫీస్ లో ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు నెంబర్ 08713 295541 అందుబాటులో ఉంటుందని ఈ సౌకర్యాన్ని విద్యార్థులు వారి తల్లిదండ్రులు వివిధ కళాశాలల యాజమాన్యాలు వినియోగించుకోవాలని కోరారు.
TS: విద్యార్థులకు అలర్ట్: ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలకు సర్వం సిద్ధం
Advertisement
తాజా వార్తలు
Advertisement