Friday, November 22, 2024

TS: హైకోర్టు ఏం చేస్తుందో.. అంతా గందరగోళం

Telangana: తెలంగాణలో ఇంటర్ ఎగ్జామ్స్‌పై గందరగోళం నెలకొంది. లక్షలాది మంది విద్యార్థుల భవితవ్యం అయోమయంలో పడింది. గతంలో టీఎస్‌ ఇంటర్‌ బోర్డు కారణంగా ఎంతోమంది విద్యార్థులు ప్రాణాలను కోల్పోయారు. అది మరువకముందే కరోనా మహమ్మారి విద్యా వ్యవస్థను అతలాకుతలం చేసింది. రెండేళ్లుగా స్టూడెంట్స్ ఎగ్జామ్స్‌ లేకుండానే పాస్‌ అయిపోయారు.

కరోనా సమయంలో ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు నిర్వహించకుండా విద్యార్థులందరినీ ప్రమోట్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడు.. కొవిడ్‌ తగ్గుముఖం పట్టడంతో పరీక్షలు నిర్వహించాలని భావిస్తోంది. దీంతో విద్యార్థుల్లో అయోమయం నెలకొంది.

ఇంటర్‌ బోర్డు తీరుపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, కాలేజీ యాజమాన్యాలు మండిపడుతున్నాయి. ఇప్పటికిప్పుడు పరీక్షల నిర్వహణ అంటే ఆశామాషీ కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలల క్రితం ప్రభుత్వం ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు నిర్వహించమని చెబుతూ అందరినీ ప్రమోట్‌ చేసినట్లు ప్రకటించిందని, ఇప్పుడు మళ్లీ ఎగ్జామ్స్‌ అంటే విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకోవడమేనని విమర్శిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఇంటర్‌ బోర్డు తీరును వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్‌ వేసింది పేరెంట్స్‌ కమిటీ. పరీక్షలు రద్దు చేయాలని కోరుతున్నారు. ఈ ఉదయం 11 గంటలకు విచారణ జరగనుంది. హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement