Friday, October 18, 2024

TS DEECET : నిమిషం ఆల‌స్య‌మైనా నో ప‌ర్మిష‌న్

నిమిషం ఆల‌స్య‌మైనా డీఈఈసెట్-22 ప‌రీక్ష‌కి అనుమ‌తి ఇవ్వ‌బోమ‌ని తెలిపారు. అభ్యర్థులు deecet.cdse.telangana.gov.in వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు.డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌, డిప్లొమా ఇన్‌ ప్రీ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించే డీఈఈసెట్‌-22 పరీక్ష తేదీని విద్యాశాఖ ప్రకటించింది. డీఈఈ సెట్‌ను ఈ నెల 23న నిర్వహిస్తామని డైట్‌సెట్‌ కన్వీనర్‌ వెల్లడించారు. ప్రవేశ పరీక్ష రెండు సెషన్లలో ఉంటుందని చెప్పారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు తెలుగు మీడియం విద్యార్థులకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇంగ్లిష్‌, ఉర్దూ మీడియం అభ్యర్థులకు పరీక్ష ఉంటుందన్నారు.

పరీక్ష ప్రారంభమైన తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను అనుమతించేది లేదని స్పష్టం చేశారు. అందుకే విద్యార్థులు పరీక్ష సయానికి గంటన్నర ముందుగానే ఎగ్జామ్‌ సెంటర్‌కు చేరుకోవాలని సూచించారు. ఈ ఏడాది డీఈఈసెట్‌ కోసం మొత్తం 11,680 మంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. ఇందులో తెలుగు మీడియం అభ్యర్థులు 4967 మంది, ఇంగ్లిష్‌ మీడియం 5348 మంది, ఉర్దూ మీడియం 1365 మంది అభ్యర్థులు ఉన్నారని తెలిపారు. అడ్మిట్‌ కార్డులు ఇప్పటికే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement