Tuesday, November 26, 2024

TS – మ‌న గో మూత్రం పేటెంట్ రైట్స్ కొట్టేసిన బ్రిట‌న్…

‘ఆవు అంటే లిచ్చే జంతువే అనుకోకు. గోవుకున్న గొప్పతనం ఎప్పుడూ మర్చిపోకు. మనిషి లేకపోయినా బతుకుతుంది గోవు. ఆవు అస్తమించిందా ఖాయం మన చావు’ చిన్నప్పుడు పుస్తకాల్లో ఉండేది. గోవు.. సనాతన సంప్రదాయంలో గొప్ప జంతువు. పురాణ కాలంలో గోవును కామధేనువుఅని పిలిచేవారు. గో క్షీరాన్ని అమృతంగా భావించేవారు. గో మయాన్ని నేలకు సారంగా ఉపయోగించేవారు. గో మూత్రాన్ని అద్భుతమైన ఔషధంగా వినియోగించేవారు. గోవు అనేది సకల జగత్తులో అద్భుతమైన జంతువుగా భావించేవారు. కాలానుక్రమంలో గో క్షీరాన్ని, గో మయాన్ని, గో మూత్రాన్ని వాడటం తగ్గి పోయింది. గోవులను మతం కోణం లో చూడటం పెరిగిపోయింది. దీంతో గో మూత్రాన్ని, మయాన్ని, క్షీరాన్ని ఒక పార్టీకి సంబంధించిన వ్యవహారంగా పరిగణించడం మొదలైంది. ఒక సెక్షన్ ప్రజలు ఇప్పటికీ వీటిని అసహ్యించుకుంటూనే ఉన్నారు.. అయితే ఇప్పుడు గో మూత్రాన్ని, మయాన్ని, క్షీరాన్ని ఇంగ్లీషు వాళ్ళు చెబుతుంటే వావ్ అంటున్నారు.

అన్ని జంతువుల్లో కెల్లా ఆవు ఎందుకు శ్రేష్టమైనది అంటే.. ఆవు శరీర నిర్మాణం అత్యంత సంక్లిష్టమైనది. ప్రాణాంతకమైన రసాయనాలను శోషించుకుని అత్యంత సమర్థవంతమైన యాంటీబయాటిక్స్ విడుదల చేస్తుంది.. అందుకే గోమూత్రంలో, గో మయంలో, గో క్షీరం లో ఔషధ గుణాలుంటాయి. అవి అనేక రకాలైన వ్యాధులను తగ్గిస్తాయి. ఈ విషయాన్ని భారతదేశానికి చెందిన పురాతన ఆయుర్వేద వైద్య నిపుణులు చెబితే.. విదేశీయులు ఓ నవ్వు నవ్వారు. భారతీయులు చెబుతోంది అంతా అసత్యమని ప్రకటించారు. సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న ఈ కాలంలో ఇంకా గోమూత్రాన్ని తాగడం ఏంటని హేళన చేశారు. కానీ ఇంగ్లీష్ వాళ్ళు గో మూత్రానికి పేటెంట్ రైట్స్ కోసం దరఖాస్తు చేస్తే అమెరికా ఓకే చెప్పింది.

గో మూత్రాన్ని అనేక విధాలుగా పరిశీలించిన పాశ్చాత్య దేశాలకు చెందిన శాస్త్రవేత్తల బృందం పేటెంట్ రైట్ కోసం దరఖాస్తు చేస్తే అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గోమూత్రంలో యాంటీబయాటిక్స్ ఉన్నాయని, ఇవి క్యాన్సర్ నిరోధకంగా పనిచేస్తాయని శాస్త్రవేత్తలు ఆధారాలతో సహా నిరూపించారు. వాటికి సంబంధించిన నివేదికలను పేటెంట్ రైట్స్ బృందానికి సమర్పించారు. వారు సమర్పించిన నివేదికతో సంతృప్తి చెందిన అమెరికా పేటెంట్ రైట్స్ బృందం సమ్మతం తెలిపింది. వాస్తవానికి ఇదే గోమూత్రానికి సంబంధించి భారతీయులు పాజిటివ్ గా ప్రచారం చేస్తే అప్పట్లో ఇంగ్లీష్ దేశాలకు చెందిన వారు నొసలు చిట్లించారు. భారతీయులు మూత్రం చుట్టూ పరిభ్రమిస్తున్నారంటూ హేళన చేశారు. కానీ ఇప్పుడు అదే ఇంగ్లీష్ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి గోమూత్రం గొప్పదనం గురించి ప్రపంచానికి తెలియజేసేందుకు.. పేటెంట్ రైట్ కోసం దరఖాస్తు చేయడం విశేషం. అప్పట్లో భారతీయులను హేళన చేసిన వారు గోమూత్రం గొప్పదనం..తెలుసుకున్న తర్వాత సైలెంట్ అయిపోయారు.

ఆవు మూత్రంలో టెట్రా సైక్లిన్, రిఫాంపిసిన్, ఆంఫిసిలిన్ వంటి వాటి తరహాలో యాంటీ బయాటిక్స్ ఉంటాయి. ఇవి యాంటీ క్యాన్సర్ గా పని చేస్తాయి. ఆవు మూత్రం లో ఉన్న యాంటీ క్యాన్సర్ కారకాలు వివిధ రకాలైన క్యాన్సర్లను దూరం చేస్తాయి. ఇవి యాంటీ ఫంగల్ గా కూడా పని చేస్తాయి. ఇలాంటి బృహత్తరమైన ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే ఆవు మూత్రానికి అమెరికా (6,896,907), (6,410,509) పేటెంట్ రైట్స్ ఇచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement