యాసంగి ధాన్యం కొనుగోళ్లు వెంటనే చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మంగళవారం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీ ధర్నాలు నిర్వహించనుంది. పెట్రోల్, డీజిల్, ఇతర నిత్యావసర వస్తువుల పెరుగుదలకు నిరసన కూడా తెలపనుంది.
ధరల పెరుగుదలకు నిరసనగా, యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలన్న ప్రధాన డిమాండ్లతో నియోజక వర్గ కేంద్రాలలో ధర్నాలు చేయనుంది. గ్రామాలలో వెంటనే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరిపించి రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరలకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పోరాటం చేస్తోంది. ఇక, హైదరాబాద్ లో ట్యాంక్ బ్యాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద, ఎర్రగడ్డ చౌరస్తాలో చేసే ధర్నాల్లో కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ మంగళవారం నిరసన కార్యక్రమాలు చేపడుతుంది.