తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నాలుగో రోజుకు చేరాయి. శుక్రవారం శాసనసభలో బడ్జెట్ పద్దులపై రెండో రోజు చర్చ జరుగనుంది. వ్యవసాయం, సహకారం, పశుసంవర్ధక శాఖ పద్దులపై సభ్యులు చర్చించనున్నారు. అదేవిధంగా రెవెన్యూ, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖ, రవాణా, పౌరసరఫరాలు, హోంశాఖ పద్దులపై చర్చ జరుగనుంది. సభ్యుల సందేహాలను మంత్రులు సమాధానం ఇవ్వనున్నారు.
కాగా, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 7న ప్రారంభం కాగా.. అదే రోజు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే.