దర్శనం ప్రీ.. .ప్రసాదం ప్రీ
పూజా సామగ్రి ధరలకు రెక్కలు
వంద రూపాయిలు దాటిన కొబ్బరి కాయ
కిలో కోడి 300 రూపాయలు
నాటుకోడి అయితే 800
పొటేల్, మేక అయితే ఒక్కోక్కటి పది వేలు
కోడి, మేక నరికితే భారీగా చెల్లించాల్సిందే
కూల్ డ్రింక్స్ డబుల్ ధరకే అమ్మకం
బీర్లు, లిక్కర్ ధరలు త్రిబుల్
వ్యాపారుల నిలువు దోపిడీ
అల్లాడుతున్న భక్త జనం
మేడారం జనసంద్రంగా మారింది. వనదేవతలను దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలి వచ్చారు. మేడారం అమ్మవార్లను దర్శించుకునేందుకు టికెట్ లేదు. ప్రసాదాలు కూడా అమ్మరు. దేవతలకు మొక్కు చెల్లించుకోవడానికి ఖర్చు లేదు. కానీ, భక్తుల జేబుకు మాత్రం భారీగా చిల్లు పడుతోంది. అక్కడ ఏది కొనాలన్న భయపడిపోతున్నారు జనం. చిన్న ఆట వస్తువులు మొదలుకుని కోడీ, యాట పిల్లల ధరలు భారీగా ఉన్నాయి. దర్శనం అనంతరం చల్లని కూల్ డ్రింక్ తాగాలన్నా భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇక మద్యం తాగాలంటే రూ.500 నోటు తీయాల్సిందే. బయట మార్కెట్‍లో దొరికే ధరలకు ఇక్కడి షాపుళ్లో అమ్ముతున్న ధరలకు భారీ తేడా ఉంది. బయట కన్నా డబుల్, ట్రిఫుల్ ధరలకు అమ్ముతున్నారు.
కోడిని కొంటె ఒకరేటు.. కోస్తే మరో రేటు..
సాధారణంగా కొబ్బరి కాయ రూ. 20 నుంచి రూ.35 మధ్య ఉంటుంది. కానీ, మేడారంలో రూ.100 అమ్ముతున్నారు. కోడి కిలోమామూలుగా అయితే రూ. 120 నుంచి రూ.140 ఉంది. కానీ మేడారంలో కిలో కోడిని రూ. 280 నుంచి రూ. 310 వరకు విక్రయిస్తున్నారు. కోడిని కోసి ఇవ్వడానికి రూ.100 తీసుకుంటున్నారు. ఇక నాటు కోడి ధర 800 వందల పైమాటే నని చెప్పనవసరం లేదు. దీంతో చాలా మంది భక్తులు ఇంటి నుంచి కొబ్బరి కాయలు, పూజ సామాను తెచ్చుకుంటున్నారు. ఇక బంగారం ధర చెప్పనవసరం లేదు.. కిలో రెండు వందల యాబై నుంచి 300 వరకు బాదేస్తున్నారు.. ప్రభుత్వం కొన్నిదుకాణాలు ఏర్పాటు చేసినప్పటికీ అవి భక్తులకు సరిపోవడం లేదు…అక్కడే గంటల కొద్ది వేచి ఉండాల్సి రావడంతో బయటే కొనుగోలు చేస్తున్నారు.
యాటపోతు విషయం చెప్పనలవి కాదు..
ఇక యాట విషయానికొస్తే మరి దారుణంగా ఉంది. 10 నుంచి 12 కిలోల మేకకు రూ.8,500 నుంచి రూ.10,500 తీసుకుంటున్నారు. దాన్ని కోయడానికి రూ.1000, తలికాయ, కాళ్లు కాపితే రూ.400 తీసుకుంటున్నారు. భక్తులను దండుకుంటున్నారు. బస్సులలో కోళ్లు, మేకలు, గొర్రెలు తీసుకురావడం నిషేధించడంతో జాతరలోనే కొనుగోలు చేయాల్సి వస్తుంది.. దీంతో ధరలు ఆకాశాలో విహరిస్తున్నాయ..
లైట్ బీర్ కొనాలంటే జేబు టైట్‌గా ఉండాలి..
లైట్ బీర్ బయట వైన్ షాపుల్లో రూ.150 ఉండగా ఇక్కడ రూ.250 నుంచి రూ.260 పలుకుతుంది. దీంతో చాలా మంది ఇంటి బీర్ కాకుండా లిక్కర్ తెచ్చుకుంటున్నారు. ఇక కోడి తీసుకెళ్తామంటే.. ఓన్ వెహికిల్ ఉండాలి. పైగా ఎండకు కోడి చనిపోయే అవకాశం ఉంది. దీంతో అక్కడ కోళ్లను కొనుగోలు చేయాల్సి వస్తోంది.