Friday, November 22, 2024

America : రహస్య పత్రాల కేసులో ట్రంప్ అరెస్ట్

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను మియామీలోని ఫెడరల్ కోర్టులో అరెస్ట్ చేశారు. మియామీలోని ఫెడరల్ కోర్టులో అరెస్టు చేసినట్లు సమాచారం. రహస్య పత్రాల కేసులో ట్రంప్‌పై విచారణ సాగుతోంది. మియామీ కోర్టులో ఫెడరల్ అధికారులకు లొంగిపోయిన తర్వాత ట్రంప్‌ను అరెస్టు చేసినట్లు అమెరికా అధికార వర్గాలు తెలిపాయి. మంగళవారం కోర్టులో విచారణ సందర్భంగా డిప్యూటీ మార్షల్స్ మాజీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వేలిముద్రల ఎలక్ట్రానిక్ కాపీలను తీసుకున్నారు.

ట్రంప్ సహాయకుడు, సహ ప్రతివాది వాల్ట్ నౌటాను కూడా అరెస్టు చేశారు. 2024 అధ్యక్ష ఎన్నికలలో రిపబ్లికన్ పార్టీ ఫ్రంట్ అభ్యర్థి అయిన ట్రంప్ చుట్టూ ఉన్న చట్టపరమైన సమస్యలు పెరిగాయి. డొనాల్డ్ ట్రంప్ 37 నేరారోపణలను ఎదుర్కొంటున్నారు. చట్టవిరుద్ధంగా జాతీయ రక్షణ సమాచారాన్ని ఉంచుకున్నారని కేసు నమోదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement