యూకేలో జరిగిన మారథాన్ లో ఒడిశా మహిళ సందడి చేసింది. దాదాపు 5 గంటల్లో మారథాన్ పూర్తిచేసింది మధుస్మిత..అంతేకాదు చీరకట్టుతో ఈ మారథాన్ లో పాల్గొనడం విశేషం. చీరకట్టుతో పరుగెత్తలేరనే అపోహను తొలగించేందుకే చీరతో మారథాన్ లో పాల్గొన్నానని తెలిపింది. యూకే లో జరిగిన మారథాన్ లో చీరకట్టులో పరుగులు తీసి అందరినీ ఆకర్షించింది.. మిగతావారితో పాటూ 42.5 కిలోమీటర్ల దూరాన్ని దాదాపు 5 గంటల్లో పూర్తిచేసింది. చీర కట్టుకుని పరుగులు పెట్టడం సాధ్యంకాదనే అపోహను దూరంచేశారు. ఉద్యోగరీత్యా మాంచెస్టర్ లో ఉంటున్న మధుస్మిత జెనా.. సొంతూరు ఒడిశాలోని కేంద్రపడ జిల్లాలోని కుసుపూర్ గ్రామం. మాంచెస్టర్ లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న మధుస్మిత గతంలోనూ పలు మారథాన్ లలో పాల్గొన్నారు. రోజూ చీరలో కనిపించే అమ్మ, నానమ్మ స్ఫూర్తితో, చీరకట్టుతో మహిళలు పరుగెత్తలేరనే అపోహను తొలగించేందుకు ఈ పోటీలో పాల్గొన్నానని మధుస్మిత తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement