– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
ఓ కంటైనర్ లారీలో డ్రగ్స్ సప్లయ్ చేస్తుండగా రాజస్థాన్‌లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ టీమ్ చాకచక్యంగా పట్టుకుంది. జైపూర్-ఆగ్రా హైవేపై రాజధోక్ టోల్ ప్లాజా వద్ద లారీని ఛేజ్ చేసి మరి 102.910 కిలోల బరువున్న 95 నల్లమందు ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ ట్రక్కును సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ (CBN), నీముచ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈశాన్య ప్రాంతం నుంచి రాజస్థాన్‌కు అశోక్ లేలాండ్ ట్రక్‌లో పెద్ద మొత్తంలో నల్లమందు తరలిస్తున్నట్టు ముందస్తుగా అధికారులకు సమాచారం అందింది. ఈ పక్కా సమాచారం మేరకు వాహనం వస్తున్న దారిలో నిఘా బృందాలను ఏర్పాటు చేశారు.
అయితే.. పోలీసులు, నార్కోటిక్స్ బృందం ట్రక్కును చూసి పక్కకు ఆపాలని కోరారు. పోలీసులను చూసిన లారీ డ్రైవర్ వారి వాహనంపైనుంచి లారీని ఎక్కించేందుకు డ్రైవర్ యత్నించాడు. అయితే ఆ ప్రయత్నం బెడిసికొట్టింది. ట్రాలర్ లోపల ప్రత్యేకంగా నిర్మించిన కేబిన్‌లో నల్లమందు దాచినట్లు గుర్తించారు.
సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ కార్యాలయానికి చేరుకున్న తర్వాత ట్రాలర్‌ను క్షుణ్ణంగా శోధించారు. ట్రాలర్ లోపల ప్రత్యేకంగా నిర్మించిన ఓ కేబినెట్లో 102.910 కిలోల బరువున్న 95 నల్లమందు ప్యాకెట్లును పోలీసులు గుర్తించారు. ఎన్‌డిపిఎస్ చట్టం, 1985 నిబంధనల ప్రకారం డ్రగ్‌తో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు.