టీఆర్ఎస్ పార్టీ శాననసభ పక్ష సమావేశం నేడు జరగనుంది. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ సమావేశంలో ధాన్యం కొనుగోలు అంశంపై బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న తీరును ప్రజల్లోకి తీసుకెళ్లడానికి టీఆర్ఎస్ కార్యాచరణ రూపొందించే అవకాశం ఉంది. ఢిల్లీలో రైతు దీక్ష లేక ధర్నా నిర్వహించాలని భావిస్తోంది. దీని కార్యాచరణ రూపకల్పనపై మంగళవారం జరిగే టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ చర్చించనున్నారు.
బీజేపీని గట్టిగా ఎదుర్కొనేందకు పార్టీ నేతలకు సీఎం కేసీఆర్ దిశానిర్ధేశం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ, బీజేపీ వైఖరితో పాటు ప్రతిపక్షాల ప్రచారాన్ని తిప్పికొట్టేలా వ్యూహ రచన చేయనున్నట్లు సమాచారం. ఢిల్లీ స్థాయిలోనూ ఆందోళనలను ఏ రూపంలో చేయాలని అనే అంశంపై చర్చించే అవకాశం ఉంది. కేంద్రం వైఖరికి నిరసనగా ఈ నెల 12న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో టీఆర్ఎస్ ధర్నాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ధాన్యం కొనుగోళ్లపై ధర్నాలు విజయవంతం కావడంతో మున్ముందు అదే స్ఫూర్తితో కార్యక్రమాలను కొనసాగించాలని కేసీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చే అవకాశం ఉంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily