తెలంగాణ రాష్ట్ర సమితిని ఇకపై లోక్‌సభలో భారత రాష్ట్ర సమితిగా పిలివడానికి తగిన విధంగా అధికారిక సర్క్యులర్ జారీ అయ్యింది. గత ఏడాది అక్టోబర్‌లో పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చారు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్. దీనిపై లోక్‌సభలోనూ పేరు మార్పు కోసం అభ్యర్థన చేశారు. ‘‘తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చడానికి కాంపిటెంట్ అథారిటీ 13.6.2023 నాటి ఉత్తర్వులను ఆమోదించింది’’ అని లోక్‌సభ సెక్రటేరియట్ నుండి వెలువడిని సర్క్యులర్ లో వెల్లడించారు. గత ఏడాది అక్టోబర్ 5వ తేదీన టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ పేరు మార్పును ప్రకటించగా.. డిసెంబర్ 8వ తేదీన భారత ఎన్నికల సంఘం ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఈ విషయంలో ఇప్పటికే రాజ్యసభ కూడా ఆమోదించింది.
Big Breaking | బీఆర్ఎస్ పేరు మార్పునకు లోక్‌సభ ఆమోదం.. సర్క్యులర్ జారీ
Advertisement
తాజా వార్తలు
Advertisement