హైదరాబాద్ హైటెక్స్‌లో గులాబీ పండగ జరుగుతోంది. టీఆర్‌ఎస్ ప్లీనరీకి వివిధ జిల్లాల నుంచి పలువురు టీఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు హాజరైయ్యారు. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ ప్రతినిధులతో పాటు మొత్తం 6 వేల మందికి ఆహ్వానం అందింది. ఈ సమావేశాల్లో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది. ఈసారి కూడా కేసీఆర్‌ను పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవడం లాంఛనం కానుంది.
ఇక, ప్లీనరీ సందర్భంగా పలు తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. అధ్యక్షులకు అభినందన, టీఆర్‌ఎస్ విజయాలు, ఆవిష్కరణలు, సాగునీరు, వ్యవసాయం, గ్రామీణ అర్ధిక వ్యవస్థలకు పరిపుష్టి, సంక్షేమ తెలంగాణ సాకారం, పరిపాలనా సంస్కరణలు, విద్యుత్ రంగాభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధి, ఐటీ రంగం అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, దళితబంధు, విద్య, వైద్య రంగాల అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వానికి టీఆర్‌ఎస్ వివిధ డిమాండ్లు తదితర తీర్మానాలను టీఆర్ఎస్ ప్రవేశపెట్టనుంది.
ఇది కూడా చదవండి: వాహనదారులకు ఊరట.. పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..