Saturday, November 23, 2024

నేడే గులాబీ పండుగ.. హెఐసీసీలో టీఆర్‌ఎస్‌ ప్లీనరీ

నేడు టీఆర్ఎస్ పార్టీ ప్లనరీ జరగనుంది. టీఆర్‌ఎస్‌ 21వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో ప్లీనరీ ఏర్పాట్ల చేశారు. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్లీనరీ జరుగనుంది.  పేద, మధ్య తరగతి ప్రజల గుండె చప్పుడు వినిపించే 13 తీర్మానాలను టీఆర్‌ఎస్‌ ప్లీనరీలో ప్రవేశపెట్టబోతున్నారు. ఈ రోజు 11 గంటలకు సీఎం కేసీఆర్‌ పార్టీ జెండాను ఆవిష్కరించి, తెలంగాణ తల్లి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి, తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించి ప్లీనరీని ప్రారంభిస్తారు. ఆ వెంటనే కేసీఆర్‌ ప్రసంగం ఉంటుంది. అనంతరం వివిధ అంశాలపై రాజకీయ తీర్మానాలు ప్రవేశపెట్టి చర్చించి ఆమోదిస్తారు. ప్లీనరీకి మూడువేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు.

కాగా, టీఆర్‌ఎస్‌ 21వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా బుధవారం ఉదయం 9 నుండి 10 గంటల మధ్య రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలు, 3,618 డివిజన్లు, పట్టణ వార్డుల్లో పార్టీ జెండా ఎగురవేయాలని పార్టీ అధిష్టానం ఇప్పటికే ఆదేశించింది.

మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్‌ చైర్మన్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, మున్సిపల్‌ చైర్మన్లు, మేయర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మండల, పట్టణాల పార్టీ అధ్యక్షులు, జిల్లాల లైబ్రరీ చైర్మన్లు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులను మాత్రమే ప్లీనరీకి ఆహ్వనించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement