కంటెంట్ ఉన్నోడి కటౌట్ చాలన్నట్టు కేసీఆర్ ఫొటోతోనే టీఆర్ఎస్ నేతలు నామినేషన్ వేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) అధ్యక్ష పదవికి నామినేషన్ సందర్భంగా ఈ సన్నివేశం జరిగింది. స్వయంగా రాకపోయినా కేసీఆర్ తరఫున పలువురు మంత్రులు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం శ్రీనివాస్ రెడ్డికి నామినేషన్ సమర్పించారు. కేసీఆర్ చిత్రపటం ఎదురుగా ఆయన తరఫున మంత్రులు నామినేషన్ పత్రాలను అధికారికి అందజేశారు. అధ్యక్ష పదవికి సీఎం కేసీఆర్‌ను మంత్రి మహమూద్ అలీ ప్రతిపాదించగా, ఇతర మంత్రులు బలపరిచారు. కేసీఆర్ టీఆర్ఎస్ చీఫ్ పదవిని తిరిగి చేపట్టడం లాంఛనమే అయినప్పటికీ, కొడుకు కేటీఆర్ కు పూర్తి స్థాయిలో పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారాల నడుమ పోటీగా మరో నామినేషన్ దాఖలవుతుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement