Tuesday, November 12, 2024

నా బలం సీఎం కేసీఆర్… ఈడీ విచారణకు సహకరిస్తా: ఎంపీ నామా

జార్ఖండ్‌లో మధుకాన్‌ కంపెనీ చేపట్టిన నేషనల్‌ హైవే ప్రాజెక్టు కోసం తీసుకున్న బ్యాంకు రుణాలను పక్కదారి పట్టించారని టీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వరరావు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి నామా జూన్‌ 25న ఈడీ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో శనివారం ఎంపీ నామా నాగేశ్వరరావు స్పందించారు.

ఎన్ని ఇబ్బందులు వచ్చినా టీఆర్‌ఎస్‌లోనే ఉంటానని నామా స్పష్టం చేశారు. తన బలం కేసీఆర్, ఖమ్మం ప్రజలే అని తెలిపారు. గత 20 ఏళ్ల నుంచి ప్రజా జీవితంలో ఉంటున్నానన్న నామా తమ కంపెనీలు ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టయన్నారు. 40 ఏళ్ల క్రితమే మధుకాన్‌ను స్థాపించానని తెలిపారు. ఏ కంపెనీలో తాను డైరెక్టర్‌గా లేనన్నారు. చైనా బార్డర్ లో కూడా తమ సంస్థ రోడ్లు వేస్తోందని, ఎక్కడ ఎవరిని మోసం చేయలేదన్నారు.  తాను రాజకీయాల్లో ఉండటం వల్ల ఆ కంపెనీలను తమ సోదరులు చూస్తున్నారని తెలిపారు.  రాంచీ ఎక్స్ ప్రెస్ వే, ఎస్పీవి బీవోటీ ప్రాజెక్టు 30 శాతం ఈక్విటీతో 2011లో ప్రారంభమైందన్నారు. ఎన్‌హెచ్ఏ అగ్రిమెంట్ తర్వాత 80 శాతం.. 90 రోజుల్లో 100 శాతం సైట్ ఇవ్వాలన్నారు. అయితే, ఏడేళ్లు గడిచినా ఎన్‌హెచ్ఏ పూర్తి సైట్ ఇవ్వలేదన్నారు. సైట్ ఇచ్చిన మేరకు 60శాతం పని పూర్తి అయిందని వెల్లడించారు. 50 శాతం పని పూర్తి అయినందున మిగితా నిధులు తామే ఇస్తామని ఎన్‌హెచ్ఏ చెప్పి, వెనక్కి వెళ్ళింది. ఎవరూ ఈ ప్రాజెక్టు మీదా కంప్లైంట్ చేయలేదు. తనకు న్యాయవ్యవస్థ పై నమ్మకం ఉందన్నారు. ఈ నెల 25న ఈడీ విచారణకు సహకరిస్తానని ఎంపీ నామా చెప్పారు.

కాగా, ఇటీవల ఈడీ బృందాలు ఎంపీ నామా సహా మధుకాన్‌ గ్రూప్‌ డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేసిన తెలిసిందే. ఖమ్మం, హైదరాబాద్‌ సహా మొత్తం 6 చోట్ల జరిపిన సోదాల్లో కీలకమైన ఆధారాలు లభ్యమైయ్యాయి. 1,064 కోట్ల రూపాయల బ్యాంకు మోసం చేసినట్లు ఈడీ పేర్కొంది. మధుకాన్ నిర్మాణ సంస్థ పలు బ్యాంకుల నుంచి భారీగా లోన్లు పొంది, వాటిని దారిమళ్లించి మోసానికి పాల్పడినట్లుగా నమోదైన అభియోగాలపై కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఎంపీ నామాకు సమాన్లు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement