టీఆర్ ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ మాజీ ప్రధాని దేవేగౌడను కలిశారు. భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ అయిన హెచ్ఎంటి మెషిన్ టూల్స్ లో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలని కోరుతూ ఈరోజు ఢిల్లీలో మాజీ ప్రధాని దేవే గౌడను కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉన్న హెచ్ఎంటి యూనియన్స్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… లేఖలో పొందుపర్చిన అంశాలు జాతీయ స్థాయిలో ఈ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఆలస్యం చేయకుండా వేగంగా పరిష్కారం చూపేలా తమరు ప్రత్యేక చొరవ చూపాలని మాజీ ప్రధాని దేవే గౌడ ను కోరానన్నారు. అనంతరం మాజీ ప్రధాని దేవే గౌడ స్పందిస్తూ… ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు పడుతూ తన వద్దకు తీసుకువచ్చిన జాతీయ రంగ సంస్థ హెచ్ఎంటీ ఉద్యోగుల సమస్యలను త్వరలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంటి నుండి యూనియన్ లీడర్స్ ఆర్.మహేందర్, జి.సత్యనారాయణ, పి.శ్రీశైలం, ఎం.ఆనంద్ రావు, బెంగళూరు ప్రెసిడెంట్ హరీష్, జనరల్ సెక్రెటరీ విజయ్ కుమార్, సదానంద్ గోపాల్, మనోహర్, ప్రాగ యూనిట్ పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital