Wednesday, November 20, 2024

కొత్త ఖాతాల్లోకి డబ్బులు.. ఈటలపై ఎస్ఈసీకి టీఆర్ఎస్‌ ఫిర్యాదు

హుజురాబాద్‌ ఉప ఎన్నికకు సమయం దగ్గర పడుతోంది. ఉన్న అతి కొద్ది సమయంలోనే ప్రజలను ఆకర్షించాలని ప్రధాన పార్టీల నేతలు విశ్వ ప్రయ్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రలోభాల పర్వం మొదలైంది. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే పలు మార్లు బీజేపీ అభ్యర్థి ఈటలపై ఈసీకి ఫిర్యాదు చేసిన అధికార టీఆర్ఎస్‌ పార్టీ.. మరోసారి కంప్లైంట్ చేసింది.

బీజేపీ అభ్యర్థి హుజురాబాద్‌లో ఓటర్లకు డబ్బులు పంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ కు టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. హుజురాబాద్ నియోజక వర్గంలో కొత్త బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే ఈటల అక్రమాలపై చాలాసార్లు ఫిర్యాదు చేశామని.. అయినా చర్యలు తీసుకోవడం లేదని అంటున్నారు. ఈటలపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని శశాంక్‌ గోయల్‌కు కోరారు. ఈ మేరకు ఎస్ఈసీని టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, టీఆర్‌ఎస్‌ నేత గట్టు రామచంద్రరావు కోరారు.

ఇది కూడా చదవండి: Huzurabad Bypoll: ఆ పార్టీలకు ఈసీ షాక్

Advertisement

తాజా వార్తలు

Advertisement