హుజూరాబాద్ ఉపఎన్నిక సందర్భంగా ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై ఈసీకి టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. పోలింగ్ జరుగుతుండగా ప్రజలను ప్రలోభాలకు గురిచేసేలా ప్రెస్ మీట్ పెట్టారని ఆరోపించారు. ఈ మేరకు ఫిర్యాదును లిఖిత పూర్వకంగా ఎన్నికల సంఘానికి పంపించారు. ఎన్నిక సందర్భంగా ఈటల రాజేందర్ కమలాపూర్‌లోని పోలింగ్ కేంద్రం 262లో సతీసమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. తరువాత ఈటల, ఆయన సతీమణి కలిసి మీడియాతో మాట్లాడారు. అయితే, పోలింగ్ జరుగుతుండగా ప్రెస్‌మీట్ పెట్టడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధం అని టీఆర్ఎస్ తన ఫిర్యాదులో పేర్కొంది. ఓటర్లను ప్రభావితం చేసేలా మాట్లాడారరని తెలిపారు. బీజేపీతోపాటు మరో రెండు మీడియా సంస్థలపై టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు.
ఇది కూడా చదవండి: Huzurabad bypoll: సాదుకున్నా మీరే.. చంపుకున్నా మీరే: ఈటల భావోద్వేగం