Tuesday, November 26, 2024

నాయకులకు నో మాస్క్… వారికి కరోనా రాదా?

కరోనా నుంచి రక్షణ పొందాలంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాల్సిందే. ప్రభుత్వం కూడా మాస్కులు ధరించని వారిపై జరిమానాలు విధిస్తోంది. మరీ ఎన్నికల వేళ ప్రచారం చేస్తున్న నేతలే మాస్కులు ధరించడం లేదు. నాగార్జున్ సాగర్ ఉపఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ నాయకులు ఒక్కరు కూడా మాస్కు ధరించలేదు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ లతో పాటు సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కూడా మాస్క్ లేకుండానే ప్రచారం చేస్తున్నారు. అంతే కాదు ప్రచారం రోడ్ షోకు వచ్చిన టీఆర్ఎస్ కార్యకర్తలకు ఎవరు కూడా మాస్క్ ధరించలేదు. రాష్ట్రంలో ఓ వైపు కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రోజు రోజుకు కేసులు రెట్టింపవుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాస్క్ ధరించడం ఒక్కటే కరోనాను అడ్డుకట్ట వేసే మార్గం. ఇలాంటి సమయంలో ప్రజాప్రతినిధులు..అందులోనా అధికార పార్టీనాయకులే మాస్కులు ధరించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రూల్స్ సామాన్యులకేనా….మంత్రులకు వర్తించవా ఉండవా అని ప్రతిపక్ష నాయకులు ఫైర్ అవుతున్నారు.

ఓ వైపు మాస్క్ ధరించకుంటే వెయ్యి రూపాయల ఫైన్ విధించాలనన్న నిబంధన తీసుకువచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే 6,500 మందికి మాస్క్ ధరించని వారికి జరిమానా విధించింది. మరీ ప్రభుత్వంలోని నాయకులే మాస్కులు ధరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నారు.

పార్టీలు ఏర్పాటు చేస్తున్న మీటింగ్లకు వచ్చే ప్రజలు కూడా మాస్కులు ధరించకపోవడంతో కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఓ వైపు కరోనా ఉధృతి తీవ్రతరమవుతోంది. మునిపెన్నడు లేని విధంగా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఈ తరుణంలో మాస్కు పెట్టుకోకుంటే ఫైన్ విధించాలని నిబంధనలు విడుదల చేసిన ప్రభుత్వంలోని నాయకులే ఇలా మాస్కులు ధరించకుండా బహిరంగా సమావేశాలకు నిర్వహించడం విమర్శలుకు తావిస్తోంది. కరోనా ప్రజలే వస్తుందా? మాస్కులు లేకుండా సభలు, మీటింగ్లు నిర్వహించే నాయకులకు రాదా ? అని ప్రశ్నిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement