Saturday, November 23, 2024

టీఆర్‌ఎస్‌ నేత ఫరీదుద్దీన్‌ కన్నుమూత

టీఆర్‌ఎస్‌ పార్టీ నేత, మాజీ మంత్రి మహ్మద్ ఫరీదుద్దీన్ (64) బుధవారం గుండెపోటుతో కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ నిన్న రాత్రి మృతి చెందారు. 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఫరీదుద్దీన్‌ రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2004లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా సేవలందించారు.

కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన.. గ్రామ సర్పంచ్‌గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి జహీరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచి.. వైఎస్ కేబినేట్ లో మైనారిటీ సంక్షేమ శాఖ, సహకార శాఖ మంత్రిగా పని చేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఆయన టీఆర్‌ఎస్‌లో చేరారు. ఫరీదుద్దీన్ మృతిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు తీవ్ర సంతాపం ప్రకటించారు. ఫరీదుద్దీన్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement