నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేయడమే మా ప్రభుత్వం లక్ష్యం అని బీసి సంక్షేమ& పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ అభివృద్ధిలో భాగంగా మంత్రి గంగుల కమలాకర్ మేయర్ సునిల్ రావు 36 వ డివిజన్ లో పర్యటించారు. నగరపాలక సంస్థ కు చెందిన 48 లక్షల సాధారణ నిధులతో మంకమ్మతోట లో సీసీ రోడ్డు నిర్మాణం, ఎస్ డబ్లుజీ డ్రైనేజీ పైపులైన్ పనులకు స్థానిక కార్పోరేటర్ గుగ్గిళ్ళ జయశ్రీ శ్రీనివాస్ తో కలిసి మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునిల్ రావు భూమీ పూజ చేసి పనులు ప్రారంభించారు. నాణ్యతతో పనులు వేగవంతంగా పూర్తి చేయాలని నగరపాలక సంస్థ అధికారులు, కాంట్రాక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. ఈ సంధర్బంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ… గత ప్రభుత్వాల హయాంలో కరీంనగర్ నగరం అభివృద్దికి చాలా ధూరంగా ఉండేదని…తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రత్యేక చొరవతో కరీంనగర్ నగర రూపు రేఖలు మారాయన్నారు.
నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేసి…బావి తరాలకు సుంధరమైన నగరాన్ని అందిస్తామన్నారు. కరీంనగర్ నగరం పై ఉన్న ప్రేమతో ముఖ్యమంత్రి కేసిఆర్ గతంలోనే 347 కోట్ల రూ. ప్రత్యేక నిధులను నగర అభివృద్ది కేటాయించారని తెలిపారు. ఇప్పటికే 200 కోట్ల రూ. అభివృద్ది పనులు పూర్తై…కాంట్రాక్టర్లకు బిల్లులు కూడ చెల్లించడం జరిగిందన్నారు. మిగిలిన నిధులకు సంబందించిన అభివృద్ది పనులను ఇప్పటికే ప్రారంభం చేసి… డివిజన్లలో పనులు కొనసాగిస్తున్నామన్నారు. ప్రతి డివిజన్ లో మట్టి రోడ్లు లేకుండా సీసీ రోడ్లను, చక్కటి డ్రైనేజీలను నిర్మాణం చేసి ప్రజలకు కావల్సిన మౌళిక సౌకర్యాలన్ని కల్పిస్తున్నామన్నారు. అంతే కాకుండ నగరంలో ఐటీ టవర్, కేబుల్ బ్రిడ్జ్, మానేరు రివర్ ఫ్రంట్ లతో నగర రూపు రేఖలు మార్చుతూ… నగరాన్ని టూరిజం హబ్ గా మర్చుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప రాణీ హరిశంకర్, కమీషనర్ సేవా ఇస్లావత్, పలువురు కార్పేరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.