Friday, November 22, 2024

లోక్‌సభను స్తంభింపజేసిన టీఆర్ఎస్.. ప్రధాని మోడీకి సభాహక్కుల నోటీసు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణ ఏర్పాటుపై ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ టీఆర్ఎస్ ఆందోళనను ఉద్ధృతం చేసింది. గురువారం లోక్‌సభ సభ్యులు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు, రాజ్యసభ సభ్యులు రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ సభాహక్కుల నోటీసును అందజేశారు. అనంతరం టీఆర్‌ఎస్ ఎంపీలు లోక్‌సభలో గందరగోళం సృష్టించారు. ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించి ఎంపీలు లోక్‌సభ నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత టీఆర్‌ఎస్, లోక్‌సభ పార్లమెంట్ ఎంపీలు తెలంగాణా భవన్‌‌కు చేరుకుని అక్కడి అమరవీరుల స్థూపం వద్ద ఆందోళన నిర్వహించారు.

జై తెలంగాణ‌, మోడీ డౌన్ డౌన్, కేసీఆర్ నాయకత్వం వర్థిల్లాలంటూ నినాదాలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో టీఆరెస్ పార్లమెంట్ సభ్యులు కె.కేశవరావు, నామా నాగేశ్వరరావు, కెప్టెన్ లక్ష్మీ కాంతరావు, బడుగు లింగయ్య యాదవ్, మన్నె శ్రీనివాసరెడ్డి, పి.రాములు, వెంకటేష్ నేత, రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం వారు తెలంగాణ‌ భవన్‌లోని గురజాడ కాన్ఫరెన్స్ హాల్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి ప్రధాని మోడీ తీరును ఎండగట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement