Tuesday, November 26, 2024

19,281 ఓట్ల మెజారిటీతో నోముల భగత్ ఘన విజయం

ఎంతో ఉత్కంఠంగా సాగిన నాగార్జున సాగర్ ఎన్నికల్లో చివరకు టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. మరోసారి సిట్టింగ్ స్థానాన్ని కారు సొంతం చేసుకుంది. టీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసిన నోముల భగత్.. సమీప కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డిపై 19,281 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ పార్టీ మైలేజ్ మీద అనుమానాలు తలెత్తగా.. వాటిని పటాపంచలు చేస్తూ నాగార్జున సాగర్‌లో టీఆర్ఎస్ గెలుపును కైవసం చేసుకుంది.

టీఆర్ఎస్ పార్టీ టికెట్ పొంది బరిలోకి దిగిన నోముల భగత్.. ముందు నుంచీ ఫలితాల్లో ఆధిపత్యాన్ని సాగించాడు. సాగర్ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అన్ని పార్టీలు.. తమతమ ప్రయత్నాలతో ఓట్లను ఆకట్టుకునే ప్రయత్నం చేయగా.. చివరకు ఓటర్లు కారుకే జై కొట్టారు. గత ఎన్నికల ఓటమి సెంటిమెంట్ తో జానారెడ్డి మీద కాస్త సానుభూతి ఉంటుందని అందరూ ఊహించగా.. అది తప్పని ఓటర్లు నిరూపించారు. కాంగ్రెస్ దిగ్గజాలు ఉత్తమ్, రేవంత్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లాంటి సీనియర్లు పోరాడినా జానాకు ఓటమి తప్పలేదు. ఇక దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ సాగర్‌‌లో మాత్రం పూర్తిగా డీలా పడింది. కనీసం పోటీ ఇవ్వకపోగా డిపాజిట్ కూడా కోల్పోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement